Kitchen

ఖాళీ కొబ్బరి చిప్ప ఖరీదు రూ 1400…. ఎందుకో చూడండి

కొబ్బరి బొండం తాగితే మహా అయితే 40రూపాయల ధర మించదు. ఇక కొబ్బరికాయ రేటు కూడా 20రూపాయలుంటుంది. అయితే కొబ్బరి చిప్ప ఖరీదు మాత్రం ఏకంగా 1400అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కొబ్బరి చిప్పలు చెత్తలో పడెయ్యడమో,పొయ్యిలో పెట్టడమో చేస్తాం. కానీ ఇది నిజం. అమెజాన్ లో ఖాళీ కొబ్బరి చిప్ప ఖరీదు అక్షరాలా 1400రూపాయలు. పైగా దాని అసలు ధర 3000రూపాయలుగా పేర్కొంటూ రాయితీతో 1400రూపాయలుగా పేర్కొన్నారు. నేచురల్ కోకోనేట్ షెల్ అనే పేరిట అమెజాన్ షాపింగ్ పోర్టల్ లో ఇలా పెట్టడం నిజంగా షాకింగ్ కలిగిస్తోంది.

సగానికి పైగా తగ్గింపు ధరతో వినియోగ దారులకు అందించడం వెనుక కారణం చెబుతూ సహజసిద్ధమైన కొబ్బరి చిప్ప కనుక ఇలా రేటు పెట్టామని చెప్పుకొచ్చింది. అయితే మహబూబ్ నగర్ ఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి రమా రాజేశ్వరి స్పందిస్తూ, ట్విటర్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రమా రాజేశ్వరి శాంతి భద్రతల విషయంలో ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో సామాజిక సమస్యలపై కూడా అదేరీతిలో స్పందిస్తారు.

ఈ కొబ్బరి చిప్పలు వివిధ సైజుల్లో అమ్మకానికి పెట్టారు. ఎక్కడ చూసిన ఈ కొబ్బరి చిప్ప పోస్ట్ దర్శనం ఇస్తోంది. అయితే చాలామంది ఇళ్లల్లో ఖాళి కొబ్బరి చిప్పలు ఉంటాయి. వీటిని శుభ్రపరిచి ఇంటికి వచ్చే అతిధులకు వంటకాలు సర్వ్ చేయడం,అందమైన పెయింటింగ్స్ వేసి అలంకరణగా చేయడం చేస్తున్నారు. అయితే మరీ ఇంత రేటు ఏమిటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."