ప్రియమణి అక్క స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా – ఇక వాళ్ళ అత్త సింగర్… ఎవరో చూడండి .
పెళ్లయిన కొత్తలో మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకుంది. ప్రస్తుతం టివి షోస్ లో జడ్జిగా రాణిస్తూ వెలిగిపోతోంది. మళయాళంలో ఓ డాన్స్ షోకి జడ్జిగా చేసింది. వెండితెరపై కూడా మెరుస్తోంది. 2006లో తమిళ చిత్రం లో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం పొందిన ప్రియమణి అనేక చిత్రాలలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో బాగా రాణిస్తున్న సమయంలోనే ప్రియమణి కెరీర్ బాగున్నా దశలోనే ముస్తాఫ్ రాజ్ ని బెంగుళూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో దండాలు మార్చుకోవడం ద్వారా నిరాడంబరంగా పెళ్లాడింది.

ప్రియమణి బ్యాక్ గ్రౌండ్ కి వెళ్తే,ఇంటర్ చదువుతున్న సమయంలో వెండితెరకు వచ్చింది. తెలుగులో ఎవరి అతగాడు మూవీతో పరిచయం అయినప్పటికీ ఆదరణ లేకపోవడంతో తమిళంలో దృష్టిపెట్టింది. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి పెళ్లయిన కొత్తలో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. వరుసగా మూడు ఛాన్స్ లు కొట్టేసిన ప్రియమణి,ఆతర్వాత ఏకంగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మంచి రేంజ్ లోకి వెళ్ళింది.

ఇక అప్పటిదాకా తెలుగింటి అమ్మాయి లా సంస్కారంగా కనిపించిన ప్రియమణి ద్రోణ మూవీతో గ్లామర్ హీరోయిన్ గా మారింది. ఆవిధంగా మిత్రుడు,ప్రవరాఖ్యుడు,శంభో శివ శంభో,సాధ్యం,రగడ,రక్త చరిత్ర మూవీస్ తో మంచి పేరు తెచ్చుకుంది. హీరోల సరసన కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి పేరుసంపాదించింది.క్షేత్రం,చారులత,చండి లాంటి మూవీస్ తో ప్రయోగాలకు ప్రియమణి కేంద్రబిందువైంది. క్రిటిక్స్ సైతం మెచ్చుకునేలా చేసింది. అందుకే చారులతకు అవార్డుల పంట పండింది.

కింగ్ సినిమాలో గెస్ట్ రోల్ తో అలరించింది. ఇక చెన్నె ఎక్స్ ప్రెస్ లో కూడా ఓ పాటలో మెరిసింది. తమిళంలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చోటు దక్కించుకుని,కన్నడంలో కూడా రాణించింది. కాగా ప్రియమణి అక్క కూడా స్టార్ హీరోయిన్ అని చాలామందికి తెలీదు. ఆమె బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ విద్యాబాలన్. స్వయంగా ప్రియమణి పిన్ని కూతురు విద్యాబాలన్. వీరిద్దరూ స్టార్ హీరోయిన్స్ గా ఒక ఊపు ఊపేస్తే,వీళ్ళ అత్త మాల్గాడి శుభ ఇండియా మొత్తం దున్నేసింది. నిజానికి ఈమె ఎంకరేజ్ మెంట్ తోనే ప్రియమణి, విద్యాబాలన్ హీరోయిన్స్ గా సెటిలయ్యారట.

