Movies

వాళ్లే నా జీవితాన్ని నాశనం చేసారు…. ఇండస్ట్రీలో జరిగే దారుణాలు బయట పెట్టిన చంటి

టివి షోలలో రాణించేవాళ్ళు సినిమాల్లో బాగా క్లిక్ అవుతున్నారు. ముఖ్యంగా జబర్ దస్త్ , బిగ్ బాస్ షోస్ లో చేసిన వాళ్ళు సినిమాల్లో చేస్తుంటే జనం బానే కనెక్ట్ అవుతున్నారు. అందుకే మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. అయితే జబర్ దస్త్ లో వేసిన చలాకి చంటికి సినిమాల్లో ఛాన్స్ లు తగ్గాయి. జబర్ దస్త్ లో వేయడమే కాకుండా కొన్ని షోస్ కి హోస్ట్ గా వ్యవహరించిన చంటి, సినిమాల్లోకి వెళ్ళాడు. సడన్ గా సినీ ఛాన్స్ లు తగ్గడంపై చంటి ఓ ఇంటర్యూలో షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇండస్ట్రీలో తనపై సృష్టించిన కొన్ని రూమర్స్ కారణంగానే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని తేల్చేసాడు. షూటింగ్ కి లేట్ గా వస్తానని,డబ్బుల కోసం గొడవ పడతానని ఇలా రకరకాల పుకార్లు తనపై వచ్చాయని అతడు చెప్పాడు.

లేనివి ఉన్నట్టు చెబుతూ పుకార్లు వ్యాప్తి చేయడంతో దక్కాల్సిన ఛాన్స్ లు పోయాయని చంటి చెబుతాడు. ‘ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డం,లౌక్యం తెలియకపోవడం వలన కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. కొందరు డైరెక్టర్స్ కలిసినపుడు పలకరిస్తారు. కానీ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా ఛాన్స్ లిమ్మని అడగడానికి అప్పుడప్పుడు వెళ్లి కలుస్తూనే ఉంటాను.

ఏదైనా ఛాన్స్ వస్తే చెబుతామని,మేనేజర్ తో టచ్ లో ఉండమని వాళ్ళు బదులిస్తారు. సరేనని మేనేజర్స్ కి ఫోన్ చేస్తే,అస్తమాను ఏంటయ్యా,ఛాన్స్ ఉంటె మేమె చెబుతాం కంగారెందుకు అంటారు. ఒక్కోసారి డైరెక్టర్స్ కి తనను తీసుకోవాలని ఉన్నా, చుట్టుపక్కల వాళ్ళు చెప్పుడు మాటలతో చెడగొడతారు’అని చంటి పలు ఆసక్తికర సంఘటనలు చెప్పుకొచ్చాడు.

ఇక కొందరు నటులైతే తమకు ఛాన్స్ లు వస్తాయన్న ఉద్దేశ్యంతో అవతలి వాళ్ళను బ్లేమ్ చేస్తూ, తమ గురించి తాము ఇష్టం వచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ, సదరు వ్యక్తుల దగ్గర భజన చేస్తారని,చివరకు వాళ్ళ పిల్లల దగ్గర కూడా భజన చేస్తే దుస్థితి కొందరు క్రియేట్ చేస్తున్నారని చంటి వివరించాడు.

ఇక సెట్ లో ఉన్నప్పుడు కొందరి హీరోల దగ్గర జోక్స్ వేయకూడదని ఒకవేళ సరదాగా జోక్ చేస్తే హీరో ముఖం మారిపోతుందని చంటి వాపోయాడు. కామెడీ కూడా వాళ్ళే చేయాలనే ఇగోతో ఉంటారని, పైగా మాలాంటి వాళ్ళను హేళన చేస్తారని తెల్పాడు. ఇక చెప్పుడు మాటల వలన చాలామంది నటీనటుల జీవితాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నాడు.

అయితే నాకు ఛాన్స్ లు రాకపోయినా నా ఫామిలీ దేవుడి దయవలన బానే ఉందని చెప్పాడు. అసలు ఇలా చెప్పుడు మాటలు చెప్పేవాళ్లతో తానెప్పుడూ కల్సి పనిచేయకపోయినా, తాను సమయానికి షూటింగ్ కి రానని,రూమర్స్ క్రియేట్ చేస్తుంటారని చంటి వాపోయాడు. ఈ పాత్రకి చలాకి చంటి సరిపోతాడని డైరెక్టర్ తదితరులు కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని, ఆమాటల్లోనే చంటిని తీసుకోవాలని అనుకున్నాం కానీ టైం కి రాడట కదా అందుకే తీసుకోలేదు అని చెప్పుకోవడం విన్నానని చంటి ఇండస్ట్రీ లోగుట్టు బయట పెట్టాడు.