Health

ఆర్గానిక్ ఫుడ్‌.. క్యాన్సర్ తగ్గించడంలో గుడ్..

రసాయనాలతో పండించే పంటల కంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఇందులో ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించడం వల్లే ఇది సాధ్యమని తేల్చారు. ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు అని ముందునుంచీ తెలుసు.. తాజాగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు శాస్త్రవేత్తలు.

70వేల మందిపై కొనసాగిన సరికొత్త పరిశోధన.. పరిశోధనల్లో ఆర్గానిక్ ఫుడ్‌ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రిస్క్ 25 శాతం తగ్గిందని తేలింది.

సాధారణ ఆహారపదర్థాలను రసాయనాలు వేసి పండిస్తారు.. కాబట్టి ఆ రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రసాయనాలు కలిగిన ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా.. మహిళలపై కొనసాగిన పరిశోధనల్లో.. ఆర్గానిక్ ఫుడ్ తినేవారు.. తినని వారికంటే 25శాతం కంటే తక్కువగా క్యాన్సర్‌ని ఎదుర్కున్నారని తేలింది. ఆర్గానిక్ ఫుడ్ తినేవారు బ్రెస్ట్ క్యాన్సర్ కారకాలను తక్కువగా కలిగిఉన్నారని తేల్చారు వైద్యులు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."