Movies

NTR,ANR లలో ఆ విషయంలో గెలిచిందెవరు,ఓడిందెవరు తెలుసా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఎన్నార్ లను రెండు కళ్ళుగా భావిస్తాం. ఇందులో ఎన్టీఆర్ కన్నా ఎన్నార్ చాలా మందే ఫీల్డ్ లోకి వచ్చినా,ఇద్దరూ సమ ఉజ్జీలుగా ఎదిగారు. తమకు తగ్గ పాత్రలను ఎంచుకుని ఒకరికొకరు పోటీపడి నటించారు. అంతేకాదు మద్రాసులో ఉండే సినీ పరిశ్రమను హైదరాబాద్ కి తరలించడంలో వీరిద్దరి పాత్ర అమోఘం. ఎన్నార్ అన్నపూర్ణ స్టూడియో, ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో నిర్మించి సినిమాలు హైదరాబాద్ లోనే నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ,అక్కినేని వారసుడిగా నాగార్జున సినిమా రంగంలో మంచి పేరుతెచ్చుకుం ఎన్నో హిట్ చిత్రాలను అందించారు.

అంతేకాదు, ఎన్టీఆర్ ఎన్నార్ ల వారసత్వం మూడవ తరంలో కూడా దూసుకెళ్తోంది. ఎన్టీఆర్ ఫామిలీ లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎదిగి, తాతకు తగ్గ మనవడిగా నిలిచాడు. హరికృష్ణ తనయుడే యితడు. తారకరత్న,కళ్యాణ్ రామ్ వంటి హీరోలు ఎన్టీఆర్ ఫామిలీ నుంచి వచ్చారు.

అయితే వీళ్లందరిలో మరో ఇరవై ఏళ్లపాటు ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టగల హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ని ఫాన్స్ భావిస్తుంటారు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా నేడో రేపో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాగా అక్కినేని ఫామిలీ విషయానికి వస్తే,నాగార్జున టాప్ హీరో గా రాణిస్తున్నాడు. ఇక అక్కినేని మూడవ తరంలో నాగచైతన్య,అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే రెండేళ్లుగా నాగచైతన్యకు హిట్స్ లేవు.

ఇక అఖిల్ కూడా మూడు మూవీస్ చేసినా హిట్ కొట్టలేదు. దీంతో ఈ బెంగ నాగార్జునను వెంటాడుతోంది. మరోపక్క అక్కినేని కుమార్తెల వారసులు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుమంత్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతడికి హిట్స్ లేవు. దాదాపు 25సినిమాలవరకూ చేసినా రెండో మూడో మాత్రమే హిట్ అయ్యాయి.

ఇక పెద్దమ్మాయి కుమార్తె సుప్రియ ఒక్కసినిమాతోనే వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే సుశాంత్ కూడా సక్సెస్ కాలేదు. అయితే నాగార్జున కేవలం కొడుకుల కోసం దృష్టి పెట్టడంతో మిగిలిన వాళ్ళను పెద్దగా ఫోకస్ చేయలేదు. దీంతో ఎవరూ కూడా స్టార్ హీరోస్ కాలేకపోయారు. పైగా కొడుకలకోసం తన సినిమాలను కుదించడం వలన మొదటికే మోసం వచ్చింది.

అక్కినేని వారసత్వ పునాదులు నిలబడే పరిస్థితి లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది. అందుకే ఎన్టీఆర్ ఎన్నార్ ల వారసత్వంలో చూస్తే ఎన్నార్ బ్రాండ్ వెనుకబడిపోతుందన్న అనుమానాలున్నాయి. అక్కినేని ఫాన్స్ కూడా వారసత్వంలో ;స్టార్ హీరో కోసం ఎదురుచూస్తున్నారు.