Movies

‘శ్రీరామ రాజ్యం’ మూవీ లోని ఈ ‘బుడ్డోడు ‘ హీరో అయ్యాడని తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు తమ ప్రతిభను చాటుతుంటారు. చిన్నపిల్లలు లేకుండా చాలావరకూ సినిమాలు రావడం లేదు. పిల్లల సెంటిమెంట్ పెట్టి మరీ సినిమాలు రూపొందిస్తున్నారు. అందుకే ఒక్కో దాంట్లో ఇద్దరు ముగ్గరు చైల్డ్ ఆర్టిస్టులు ఉంటున్నారు. అగ్ర హీరోలు సైతం చైల్డ్ ఆర్టిస్టులను తమ సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైల్డ్ ఆర్టిస్టు మామూలోడు కాదు. చాలా టాలెంట్ గలచైల్డ్ ఆర్టిస్ట్. శ్రీరామ్ రాజ్యంలో బాలహనుమాన్ పాత్రతో పాపులర్ అయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ బాల హనుమాన్ గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఏకంగా హీరో అయ్యాడు.

పదేళ్ల వయస్సులో హరేరామ్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడి పూర్తి పేరు పొనుగుపాటు పవన్ శ్రీరామ్. పైగా వచ్చీ రావడంతోనే డబుల్ రోల్ పోషించి మరీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు.

టక్కరి,నగరం,బలాదూర్,ఒక్కడున్నాడు,సౌర్యం , ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, దడ ,శ్రీరామ రాజ్యం, మిస్టర్ పెర్ఫెక్ట్ ,ఎందుకంటే ప్రేమంట, ప్రస్థానం,గమ్యం -2 ఇలా దాదాపు 35సినిమాల్లో బాలనటుడిగా అలరించిన ఈ చిన్నోడు శ్రీరామ రాజ్యంతో మంచి గుర్తింపు పొందాడు.

పైగా బాపు సినిమా కావడంతో నటనలో ఆరితేరాడు. శ్రీరామరాజ్యం మూవీతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా దక్కించుకున్న పవన్ శ్రీరామ్ ఈటివి, మాటివి,భక్తి టీవీలలో ప్రసారం అయిన ఎన్నో సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి బుల్లితెర ఆడియన్స్ నుంచి కూడా గుర్తింపు పొందాడు.

ఈటీవీలో మనసు చూడ తరమా, శ్రీ వెంకటేశ్వర మహత్యం,సృష్టి,వ్రత కథలు, తరిగొండ వెంగమాంబ వంటి సీరియల్స్ లో నటించి మెప్పించిన పవన్ శ్రీరామ్ పెద్దయ్యాక ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో మోడల్ గా రాణించాడు. ఇక సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ శ్రీరామ్ కిరాక్ పార్టీలో సెకండ్ హీరో పాత్రను పోషించాడు. మరి హీరోగా కూడా మారి, మంచి పేరు తెచ్చుకుంటాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.