Movies

కళ్యాణ్ రామ్ 118 సినిమా ట్రైలర్ రివ్యూ…మరో హిట్ కొట్టే ఛాన్స్ ఉందా?

చాలా కాలం తరవాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా విడుదల కాబోతోంది. నివేత థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా కెవి గుహన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా 118. ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో విడుదలకు రంగం సిద్ధం అయింది. ఇదే సమయంలో ధియేటిరికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో షాలిని పాండే , కళ్యాణ్ రామ్ లవర్స్ గా కనిపిస్తున్నారు. ఆర్టిస్ట్ ప్రభా శ్రీను ఇప్పుడు వీడి డ్రీమ్ గర్ల్ వేరు అని చెబుతున్నాడు. ఓ అమ్మాయి ప్రమాదంలో ఉండగా హీరో కలగంటున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.

గతంలో విడుదల చేసిన టీజర్ లో అంటిల్ ద డే అనే డైలాగ్ వచ్చింది. ఈ డైలాగ్ చెప్పగానే నివేత థామస్ ని ఎవరో గట్టిగా కొడితే బెంచిపైన పడుతుంది. ఆమె ముఖం ఆమె చూపు అసలు ఆ అమ్మాయి ఉంటుందా అని డైలాగ్ చెబుతున్నాడు. దీన్ని బట్టి ఈ మూవీ మొత్తం నివేత థామస్ కోసం వెతికే కళ్యాణ్ రామ్ కథగా భావించవచ్చు. 0. 35 సెకండ్ దగ్గర ‘ఏ హిడెన్ ట్రూత్’అనే టెక్స్ట్ వచ్చింది.

ఏదో దాగిన నిజాన్ని హీరో వెలికి తీస్తాడని ఈ సీన్ ని బట్టి తెలుస్తోంది. ఇక నివేత థామస్ కోసం వెతుకుతూ హీరో, అన్ నోన్ ఎనిమిని ఫైండ్ చేస్తాడు. కళ్యాణ్ రామ్ కి ఇందులో ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమా కథగా చెప్పవచ్చు. కళ్యాణ్ కి ప్రభాస్ శ్రీను, హర్ష వర్ధన్ లు తోడుగా ఉన్నారు. అలాగే మరో షాట్ లో రాజీవ్ కనకాలను గుర్తించవచ్చు.

ఇతడి రోల్ కీలకం కానుందని తెలుస్తోంది. స్టోరీలో డెప్త్ ఉంటె సినిమా సక్సెస్ ఖాయం. ఈ సినిమాను ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఓ పాయింట్ ని తీసుకుని నడిపిస్తున్నట్లు చెప్పవచ్చు. గతంలో భూమిక నటించిన అనసూయ మూవీ కూడా ఈ ట్రేలర్ ని చూస్తే గుర్తొస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.