Movies

విజయశాంతి జీవితంలో ఈ శోకం తీరనిది …. ఇంతకీ ఏమిటో తెలుసా ?

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గానే కాదు,లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా కూడా రాణించి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ గా విజయశాంతికి పేరుంది. హీరోలతో సమానంగా పారితోషం అందుకున్న హీరోయిన్ ఈమె. గ్లామర్ హీరోయిన్ గా,పవర్ ఫుల్ రోల్స్ వేసే హీరోయిన్ గా , ఫ్యామిలీ హీరోయిన్ గా ఇలా పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్ ఆమె. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్,వంటి మేటి నటులతో నటించిన ఈమె సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో కాలుపెట్టింది.

విజయశాంతి 15ఏళ్ళ వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కల్లుకులి ఇదం అనే తమిళ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితం అయినప్పటికీ ఆతర్వాత స్టెప్స్,ఆపైన నటనకు ఇంపార్టెన్స్ గల సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. సినీ రంగంలో తారాస్థాయికి చేరిన ఈమె నటనను స్వర్గీయ టి కృష్ణ గుర్తించారు.

వందేమాతరం,నేటిభారతం,ప్రతిఘటన వంటి సినిమాలు ఆమె కెరీర్ కి బ్రేక్ ఇచ్చాయి. ఆరోజుల్లో చిరంజీవి,బాలయ్య లతో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. ఆమె తండ్రి శ్రీనివాస్ రామగుండం ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇక పినతల్లి విజయలలిత కోరిక మేరకు అప్పట్లో మద్రాస్ వెళ్లి సెటిలయ్యారు. తండ్రి అంటే విజయశాంతికి ఎంతో ఇష్టం.

అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకునేవారు. అయితే శోభన్ బాబు హీరోగా 1985లో దేవాలయం మూవీ షూటింగ్ సమయంలో ఆమె తండ్రి కన్నుమూసారు. అయితే షూటింగ్ జరుగున్నందున ఆమెకు విషయం చెప్పలేదు. షూటింగ్ ముగిసాక ఇంటికి వెళ్లే సమయంలో చెప్పడం ఆమె షాక్ తింది. కొన్నాళ్లపాటు షూటింగ్స్ వెళ్లకుండా తనలో తాను కుమిలిపోయేది. ఇక ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్. తండ్రి పేరు కూడా కల్సి ఉండడంతో అతనితో ప్రేమలో పడి పెళ్లాడింది.