Movies

RRR సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చిన రాజమౌళి…. షాక్ లో టాలీవుడ్

జయాపజయాలు ఎవరికైనా సహజం. కానీ అపజయం అనేది లేకుండా విజయాల వైపు దూసుకుపోవడం ఎస్ ఎస్ రాజమౌళి ప్రత్యేకత. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ ఎవరితో మూవీ తీసినా, అది పెద్దదైనా, చిన్నదైనా సరే విజయం దక్కించుకుంటూనే ఉంది. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి బాహుబలి వరకూ ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక బాహుబలితో తెలుగు సినిమాను వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక కొత్తగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రాజెక్ట్ కి జక్కన్న డైరెక్షన్ చేస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ పై భారీ అంచనాలున్నాయి. డివివి ఎంటర్ టైన్ మెంట్ బానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ దాదాపు 300కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పరిణీతి చోప్రా,అలియా భట్ లను హీరోయిన్స్ గా ఎంపికచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ జక్కన్నను స్పెషల్ గా ఇన్వైట్ చేసి స్టూడెంట్స్ ఉద్దేశించి ప్రసంగించాలని కోరింది.

తన సతీమణి రమా తో కల్సి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన జక్కన్న అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ తో స్పెషల్ గా భేటీ అయ్యారు.ఈ సందర్బంగా జక్కన్నఫ్యామిలీతో స్టూడెంట్స్ సెల్ఫీలు దిగడానికి పోటీ పోటీ పడ్డారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీని మొత్తం భారత దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న సినిమా అని జక్కన్న చెప్పుకొచ్చాడు.

సినిమా కథ గురించి మాత్రం తనను అడగొద్దని జక్కన్న తప్పించుకున్నాడు. ఏదో ఒక భాష దీనికి టార్గెట్ కాదని,కథను బట్టి ఇది ఇండియాలో అన్ని ప్రాంతాలకు చెందుతుందని, అయితే బాహుబలి కన్నా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలని రాజమౌళి ధీమాగా చెప్పాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."