Movies

ఎన్టీఆర్ కొడుకు పెళ్లి జరిగిన తీరు దారుణం … ఎలా జరిగిందో తెలుసా?

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నప్పుడు నటనకు,రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత కుటుంబానికి ఇవ్వలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలు కూడా ఎన్నో చెబుతుంటారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడులో చూపించిన ఘటన చూస్తే నటనకే ఎక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓ సినిమా షూటింగ్ లో ఉండగా ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ చనిపోతాడు. ఆ విషయం సెట్ లో గల ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే తనవలన నిర్మాత దెబ్బతినకూడదని భావించి షూటింగ్ యధాతధంగా చేసేసి,ఆతర్వాత కొడుకు భౌతిక కాయం దగ్గరకు ఎన్టీఆర్ వెళ్లే సీను ఆ మూవీలో చూపించారు.

ఇంటికి వెళ్ళాక కూడా రెండు మూడు కన్నీటి బొట్లు రాల్చేసి ధైర్యంగా ఉంటాడు ఎన్టీఆర్. కుటుంబం మాత్రం రోదిస్తూ ఉంటుంది. కొన్నాళ్లపాటు ఎన్టీఆర్ కుటుంబం బాధల్లో ఉంటె ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాల్లో నటిస్తారు. ఆ సీన్ చూసిన ఆడియన్స్ కి దిమ్మతిరుగుతుంది. ఎందుకంటే ఎవరి ఇంటనైనా సరే చావు వస్తే ఆగలేని దుఃఖం వస్తుందని అంటారు. ఇక మహానాయకుడులో ఓ సన్నివేశం ఉంటుంది. ఎన్టీఆర్ కొడుకుల పెళ్లిళ్ల సమయంలో ఎన్టీఆర్ రాజకీయ యాత్ర చేస్తుంటారు. అందులో బాలకృష్ణ పెళ్లి కూడా ఉంటుంది.

పెళ్లంటే ఇంటిల్లిపాదీ సందడి అంటారు కదా. కానీ ఎన్టీఆర్ రారు. ఇలా ఆయన ఇంట్లో పెళ్లి,చావు కూడా తన నటన, రాజకీయ జీవితాలకు ఫణంగా పెట్టారు. నాదెండ్ల భాస్కరరావు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ తీరుని హిపోక్రసీ తో పోలుస్తారు. కొడుకుల చావుబతుకులు,పెళ్లిళ్ల కోసం పట్టించుకోకుండా జనం కోసం బతికేస్తున్నాన్న బిల్డప్ ఇవ్వడం కోసమే ఎన్టీఆర్ ఇలా చేసేవారని నాదెండ్ల అంటారు. ఎప్పుడూ కూడా కొడుకుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవంటారాయన.

ఇక బాలయ్య చెన్నైలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారని తెల్సి,ఏదో పెళ్లి చేయాలన్న ఉద్దేశ్యంతో తూతూ మంత్రంగా ఒప్పేసుకున్నారని నాదెండ్ల అనేమాట. హరికృష్ణ విషయానికి వస్తే తండ్రి ఓ పెళ్లి చేస్తే,అతనొక అనధికార పెళ్లి చేసుకున్నారని నాదెండ్ల చెప్పుకొస్తారు. అయితే మరో కొడుకు జయ శంకర్ కృష్ణ అబిడ్స్ లోని నివాసంలో బ్రహ్మచారిగా ఉండిపోయాడు. తండ్రి పోయాక కూడా అతడికి ఎంతకీ పెళ్లవ్వలేదు. అయితే తన బావ చంద్రబాబు సమక్షంలో కేవలం వందమంది సమక్షంలో అతడికి పెళ్లయింది.