Movies

నటుడు సత్యప్రకాష్ గుర్తు ఉన్నాడా… కొడుకు కూడా హీరోనే…ఎవరో చూడండి

సినిమాల్లో వారసత్వం సహజమై పోయింది. ఒకప్పుడు సినిమాల్లో వేషాలకోసం పరితపించిన సత్య ప్రకాష్ పలు సినిమాల్లో విలన్ గా మెప్పించి, ఇప్పుడు కొడుకుని కూడా హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో మునిగిపోయాడు. పాతికేళ్ల ప్రస్థానంలో నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఎదిగాడు. ఆ భగవంతుని,ఆడియన్స్ ఆశీస్సులే కారణంగానే ఈ స్థాయికి ఎదిగాని చెప్పే యితడు సాయికుమార్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ పోలీస్ స్టోరీ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఒడిశా వాసి అంతకుముందు ఆర్మీలో కూడా పనిచేసాడు. చూడ్డానికి కన్నడ మనిషిలా కనిపిస్తాడు కానీ, 30ఏళ్లపాటు ఒడిశాలో గల సత్యప్రకాష్ అక్కడ డిగ్రీ చేసి, ఆతర్వాత కోల్ కత్తాలో ఎంబీఏ చేసాడు. బ్యాంకు ఎంప్లాయ్ గా మారాడు. ఆతర్వాత డిఫెన్స్ లో కూడా చేసాడు.

అయితే ఎక్కడా ఎడ్జెస్ట్ కాలేక, సినిమాల్లో నటించాలన్న కోరికతో సత్యప్రకాష్ చెన్నై వచ్చేసాడు. అమితాబ్ ని చిన్నప్పటినుంచి చూసి అలా నటించాలన్న కోరికతో మద్రాసు చేరి, టీ షాపుల్లో,సిగరెట్ కోట్లదగ్గర కొద్దికొద్దిగా తమిళం మాట్లాడేవాడట. . చెన్నై సెంట్రల్ స్టేషన్ లోనే కొన్ని నెలలపాటు పడుకున్న సత్యప్రకాష్ కొడంబాకం ప్రాంతానికి వెళ్లి, సినిమాల్లో వేషాల కోసం ఐదేళ్లు కాళ్లరిగేలా తిరిగాడట.

హిందీ మాత్రమే రావడం వలన సినీ ఛాన్స్ లు రాలేదు. చివరకు పోలీస్ స్టోరీ మూవీలో ఛాన్స్ రావడంతో కసితీరా యాక్ట్ చేసి,ఆడియన్స్ మనసు దోచుకున్నాడు. అలా ఎంట్రీ ఇచ్చిన సత్యప్రకాష్ దశతిరిగింది. ఆ సినిమా చూసిన తమిళ డైరెక్టర్ భాగ్యరాజా తన తమిళ మూవీలో ఆఫర్ ఇచ్చాడు. స్పాట్ లో భారీ డైలాగులు చకచకా చెప్పేసి సినిమాలో బుక్ అయ్యాడు.

ఇక వరుసగా తెలుగు,తమిళ,బెంగాలీ,హిందీ ఇలా న్నీ భాషల్లో సినిమాలు చేసాడు. దాదాపు 10భాషల్లో 500 సినిమాలు చేసాడు. చిరంజీవి, బాలయ్య,వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్, ఇలా అందరి సినిమాల్లో విలన్ గా మెప్పించాడు. దిష్టి ,అద్భుతం అనే తెలుగు సినిమాల్లో చేస్తున్న సత్యప్రకాష్, ఇక గిరిగిట్లే అనే కన్నడ మూవీ లో కూడా చేస్తున్నాడు.

హిందూ మతాన్ని వృద్ధిచేయాలని, ప్రతిఒక్కరూ సేవా మార్గం ఎంచుకోవాలని చెబుతాడు. మెగాస్టార్ చిరంజీవిని అభిమాన నటుడుగా చెప్పుకుంటాడు. ఇక కొడుకు నటరాజ్ ని హీరోగా పెట్టి తానే డైరెక్టర్ గా సినిమా చేస్తున్నాడు. హుల్లాలా హుల్లాలా అనే హర్రర్ కామెడీ మూవీ ఇది.