Movies

నగ్మా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఎవరో తెలుసా?

సినిమా హీరోయిన్స్ లో రకరకాల తీరుతెన్నులు ఉన్నవాళ్ళుంటారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్ళిచేసుకుని సెటిల్ అయిపోయి,పిల్లలు పుట్టాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. కొందరు పెళ్లి చేసుకుని,విడాకులు కూడా తీసేసుకుంటారు. ఇక కొందరు ఎంత వయస్సు వచ్చినా పెళ్లి ఊసెత్తరు. ఇక 45 ఏళ్ల వయసు వచ్చిన నగ్మా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ ముద్దుగుమ్మ 1980, 90లలో తెలుగు, తమిళంలో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో పోటీ పడి మరీ నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లింది.

రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నగ్మా తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఉందని చెప్పుకొచ్చింది. దాంతో అప్పటి నుండి త్రివిక్రమ్‌ తర్వాత మూవీలో అల్లు అర్జున్‌కు తల్లిగా నగ్మా నటిస్తుందా అని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల నేపథ్యంలో తాజాగా ఒక సౌత్‌ మీడియా సంస్థకు నగ్మా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తాను సినిమాల్లో తిరిగి నటించాలనుకుంటున్న మాట వాస్తవమేనని, అయితే ఇప్పటి వరకు తనను ఎవరు సంప్రదించలేదని చెప్పింది.

ప్రస్తుతం తాను రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా సినిమాలు చేసే పరిస్థితి కూడా లేదని, అల్లు అర్జున్‌తో మూవీ అంటూ వస్తున్న వార్తలు పూర్తి అబద్దంగా కొట్టిపారేసింది. అయితే, పెళ్లి వయసు దాటి పోయినా కూడా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రశ్నించిన సమయంలో నగ్మా స్పందిస్తూ, ‘నా పెళ్లి నా చేతిలో లేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని దేవుడు ఎప్పుడో నిర్ణయించి ఉంటాడు.

అయితే ఆ సమయం ఇంకా రాలేదేమో అని నేను భావిస్తున్నాను’అని వ్యాఖ్యానించింది. అంతటితో ఆగకుండా అసలు నా జీవితంలో పెళ్లి అనేది రాసి ఉందో లేదో కూడా నాకు తెలియదు అంటూ నగ్మా వింతగా చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. సందర్బం వచ్చినప్పుడు ఏది ఆగదు అని, వెంటనే జరిగి పోతుందని అనడం కొసమెరుపు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."