Movies

జీవిత – ఊహ జీవితాల్లో చాలా పోలికలు ఉన్నాయి….అవి ఏమిటో చూడండి

సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్ఠాలు ఎదుర్కొని హీరోయిన్ గా రాణించాలంటే అందునా స్టార్ హీరోల పక్కన నటించాలంటే చాలా కష్టం. అయితే ఈ కష్ఠాలను ఓర్చుకుని నిలబడిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇక సినిమాల్లో యాక్ట్ చేస్తూ తమ హీరోలతో లవ్ లో పడి,రియల్ లైఫ్ లో కూడా తమ గొప్పతనాన్ని చాటి చెప్పే హీరోయిన్స్ ఉన్నారు. అయితే ఇలాంటి వాటిలో ఇద్దరి నిజ జీవిత ప్రేమ కథల్లో ఘటనలు ఒకేరకంగా ఉన్నాయి. ఈ రెండు జంటలకు సంబంధం అసలు లేకున్నా ఘటనలు ఒకేలా ఉండడం విశేషం.

వాళ్లేవారంటే జీవిత – రాజశేఖర్,ఊహ – శ్రీకాంత్. రాజశేఖర్ , శ్రీకాంత్ కూడా ఈ హీరోయిన్స్ మాకొద్దు అంటే వద్దు అని మొండికేసినవాళ్లేనట. ఈవిడ కి మొదటి సినిమా అయితే ఈమెతో నేను చెయ్యను అనేసేవారట. ఈ హీరోయిన్స్ వద్దంటే, మేం వేరే హీరోలను చూసుకుంటాం అని నిర్మాతలు అనేసరికి తప్పదన్నట్లు వొప్పుకున్నారట.

తీరా ఆ సినిమాల్లో వాళ్ళనటనకు జనం నీరాజనం పట్టడం, ఆ సినిమాలు హిట్ అవ్వడంతో చివరకు వాళ్ళ జీవిత భాగస్వాములయ్యారు. ఇలా మొదట్లో నై అన్నవాళ్ళే ఆతర్వాత సై అంటూ ప్రేమలో పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో వద్దన్నా సరే ,పెళ్లి చేసుకుని అందరిచేతా మంచి జంటలుగా అనిపించుకుంటున్నారు.

నిజానికి లవ్ చేసి పెళ్లిచేసుకున్న సినీ జంటల పెళ్లిళ్లు విడాకులకు దారితీస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ రెండు జంటలు పిల్లాపాపలతో హాయిగా, ఆనందంగా జీవితం సాగిస్తున్నారు. ఈ హీరోయిన్స్ వద్దు అన్నవాళ్లతోనే వరుస సినిమాలు చేసి,రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. అటు జీవిత, ఇటు ఊహ కూడా తమ భర్తలకు మంచి సహకారం అందిస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లలను ప్రయోజకులుగా మారుస్తున్నారు. అందుకే రాజశేఖర్,శ్రీకాంత్ లు సమర్ధవంతంగా నిలబడగలిగారని చెప్పాలి.