ఫ్రెండ్ బట్టలు వేసుకొని పూట గడుపుకున్న ఈ స్టార్ హీరో సంగతి తెలుసా ?
చాలామంది నిజ జీవితంలో కష్టాలు ,కడగండ్లు ఎదుర్కొని ఉన్నతి స్థితికి వచ్చినవాళ్లే ఉంటారు. ఇందులో కొందరు తమ పాతరోజులు మర్చిపోతే,మరికొందరు పదిలంగా దాచుకుని పదిమందికీ ఆదర్శవంతం అవుతారు. తమిళనాట రజనీకాంత్,విజయ్ లాంటి నల్లగా ఉన్న హీరోలను లైక్ చేయడం రివాజు. కానీ తెల్లగా ఉండే అజిత్ కూడా విశేష ప్రేమాభిమానాలు పొందాడు. తెలుగు వాడై ఉండి తమిళ చిత్ర సీమలో దుమ్మురేపుతున్న అజిత్ సికింద్రాబాద్ లో పుట్టాడు. ఏంయిడు ఎన్మన్ అనే తమిళ మూవీ ద్వారా అడుగుపెట్టి, ప్రేమ పుస్తకం అనే తెలుగు మూవీలో కూడా హీరోగా చేసాడు. కాదల్ కొట్టాయి అనే తమిళ మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. అదే మూవీ తెలుగులో ప్రేమలేఖ గా విడుదలై తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇక తమిళ ఫాన్స్ అతడిని తల అని ముద్దుగా పిలుస్తారు.

ప్రేమలేఖ మూవీతో అజిత్ తెలుగునాట స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ పెద్దగా తెలుగులో నటించలేదు. వాలి,కాదల్ మన్నన్, ముగవరి వంటి సినిమాలతో తమిళనాట తారాస్థాయికి చేరిన అజిత్ తమిళ ఆడియన్స్ కి ఎడిక్షన్ అయ్యాడు. విశ్వాసం మూవీ తాజాగా విడుదలై 200కోట్ల రూపాయల కనకవర్షం కురిపించింది. అంతకు ముందు వేదాలం,వివేగం మూవీస్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాడు. ప్రస్తుతం హిందీ మూవీ పింక్ కి రీమేక్ గా నెర్కొండ పర్వాయ్ అనే సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. జయలలిత తర్వాత అన్నా డీఎంకే లో అజిత్ పేరు వినిపించిందంటే అతని రేంజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.

అయితే ఎస్పీ బాలు ఆ మధ్య సూపర్ సింగర్ కార్యక్రమంలో అజిత్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కొడుకు చరణ్ కి మిత్రుడైన అజిత్ మెట్రిక్యులేషన్ వరకూ ఇద్దరూ కల్సి చదువుకున్నారని చెప్పారు. ఇండస్ట్రీలో రాజకీయాలను అసలు పట్టించుకోడని,ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడని మనస్తత్వం గల ఇలాంటి హీరోలు అరుదుగా ఉంటారని బాలు చెప్పారు.

సెంటిమెంట్స్ ఎక్కువగల అజిత్ యాడ్ షూటింగ్ కి వెళ్ళేటప్పుడు తనకొడుకు చరణ్ బట్టలు, షూస్ వేసుకుని వెళ్లేవాడని, నిజానికి అది కూడా ఓ సెంటిమెంట్ గా అజిత్ కి మారిపోయిందని బాలు వివరించారు. చిన్నచిన్న వేషాల కోసం తిరుగుతూ సినిమాల్లో నిలదొక్కుకునే సమయంలోనే ఒకేసారి ప్రమాదం జరిగిందని,అయితే తర్వాత కోలుకున్నాడని, మొత్తానికి తమిళనాట అగ్ర హీరోగా మారాడని బాలు చెప్పుకొచ్చారు.

తానూ నిర్మించిన సినిమాలో నటించిన అజిత్ మ్యాగజైన్స్ కి,టీవీలకు ఇంటర్యూలు ఇవ్వకుండా, రిజర్వ్ గా సింపుల్ గా ఉంటాడని వివరించారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కి దూరంగా ఉంటాడని, గతంలో బైక్స్ అంటే ఎంతోఇష్టపడే అజిత్ వాటికి దూరంగా ఉంటున్నాడని, నిజానికి శాలినిని పెళ్లాడాక సినిమాలు, ఇల్లు తప్ప మరోలోకం అతడికి లేదని బాలు వివరించారు.

