Movies

స్టార్ ఫ్యామిలీల నుండి వచ్చిన కథానాయికలు!

హీరోల విషయానికొస్తే దాదాపుగా అందరూ వారసత్వం నుండే వస్తుంటారు. అన్ని చిత్ర పరిశ్రమలలో కూడా వారసుల హవా కనపడుతుంది. తమ అభిమాన నాయకానాయికల వారసుల అరంగేట్రం గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అందులోనూ హీరోయిన్లుగా, స్టార్స్‌గా సెలబ్రిటీల కుమార్తెలు రావడం మరింత స్పెషల్‌ కదూ! కానీ మన దక్షిణాదిలో సెలబ్రెటీల ఫ్యామిలీస్ వారసులలో మగవారికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మహిళలకు ఇవ్వరు. వారిని గ్లామర్ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సందేహిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న కొందరు నటీమణులు మాత్రం అందుకు భిన్నం అంటున్నారు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దూసుకెళ్తున్నారు. వారెవరో చూద్దాం…

నిహారిక

మెగా వారసురాలు నిహారిక కొణిదల.. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన నాగేంద్రబాబు కూతురు.

కల్యాణీ ప్రియదర్శన్
Liji And Kalyani
కల్యాణీ ప్రియదర్శన్, తెలుగు తెరకు ‘హలో’ సినిమా ద్వారా పరిచయమైన భామ. ఈమె తల్లి మలయాళం స్టార్ హీరోయిన్ లిజి మరియు తండ్రి ప్రియదర్శన్. ఇతను మలయాళ, హిందీ చిత్రాలలో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

శృతి హాసన్, అక్షరా హాసన్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తెలు. శృతి హాసన్ తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అక్షర హాసన్ అజిత్ ‘వివేకం’ చిత్రంతో తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

మంచు లక్ష్మి

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి అనేక హాలీవుడ్ చిత్రాలలో నటించి తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించింది.

కార్తిక, తులసి

అలనాటి కథానాయిక రాధ కుమార్తెలు కార్తీక మరియు తులసి. 2009 లో అక్కినేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా ‘జోష్’ తో తెరంగేట్రం చేసింది కార్తికా.రెండవ కుమార్తె తులసి కూడా ‘కడలి’ సినిమాతో సినీ అరంగేట్రం చేసింది.