Politics

బాలయ్య చిన్నల్లుడి ఆస్తులు ఎంతో తెలుసా?

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖ నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ తెలుసుకుందాం.
2014-15లో భరత్ వార్షికాదాయం రూ.5 లక్షలు కాగా.. 2018-19 నాటికి ఆయన వార్షికాదాయం రూ.23 లక్షలకు చేరింది. ఆయన భార్య తేజస్విని వార్షికాదాయం 2014-15లో రూ.10 లక్షలు ఉండగా.. 2018-19 నాటికి అది రూ.57 లక్షలకు చేరింది. భరత్‌‌కు గుర్గావ్‌లో ఫామ్ హౌస్ సహా రూ.190 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట రూ.27 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

సిద్దేశ్వర్ పవర్ జనరేషన్, వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ, నేచురల్ శాండ్స్, బసిల్ ఇన్‌ఫ్రా.. తదితర సంస్థల్లో భరత్ రూ.5.52 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఆయన భార్య తేజస్వినికి మెడ్‌విన్‌లో కంపెనీలున్నాయి. ఆమె దగ్గర ఉన్న బంగారం, వెండి, వజ్రాభరణాలు, బ్యాంకు డిపాజిట్ల విలువ రూ.7.26 కోట్లు. భరత్-తేజస్విని దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఆ పసివాడి పేరిట రూ.2.26 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.