Politics

రచ్చ రచ్చ అవుతున్న టీడీపీ ఎలక్షన్ యాడ్స్…. ఇది మ్యాటర్

ఎన్నికలన్నాక విమర్శలు,ప్రతివిమర్శలు సహజం. ఇక ఎన్నికల ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ అవుతోంది. ఇక ప్రకటనలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. యూట్యూబ్ లో ,సోషల్ మీడియాలో ప్రకటనలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక టిడిపి విడుదల చేసిన ఎన్నికల ప్రకటనలు అయితే వివాదాస్పదం అవుతున్నాయి. ఇక ప్రకటనల్లో మొదటి దాంట్లో లబ్ధిదారులకు ఆవు ఇచ్చారని చెబుతూ అందులో ఎద్దు చూపించారట. ఇది షోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నారు.

ఇక ఈ అంశం వైరల్ అవ్వడంతో బిజెపి నేతలు కూడా ట్వీట్ చేసారు. ఇక అన్నదాత సుఖీభవ పధకంలో యాడ్ చూస్తే,ఈ పధకం కింద చంద్రబాబు 15000 చెల్లించినట్లు యాడ్ లో నటించిన వ్యక్తి చేత చెప్పించారు. కానీ నిజానికి అన్నదాత సుఖీభవ పధకంలో ఒక్కొక్క రైతుకి చెల్లించిన ఎమౌంట్ కేవలం వెయ్యి రూపాయల చొప్పున మాత్రమే.

కానీ ఇప్పటికే 15వేలు ఇచ్చేసినట్లు టిడిపి తన ప్రకటనల్లో చెప్పేస్తోంది ఓటర్లను తప్పుదోవ పట్టించారంటూ ఈ యాడ్ పై కూడా బోల్డన్నీ విమర్శలు వచ్చాయి. ఇక మరో యాడ్ చూస్తే, ఓ యువకుడిని ఎవరో కొడుతున్నట్లు ఉంటుంది . ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు,గ్రాఫిక్స్ లా ఉంటున్నాయని ఆ యువకుడు అంటుంటే టిడిపి వీరాభిమాని అతడిని కొట్టడం విశేషం.

ఇది కూడా దుమారం రేపుతోంది. హింసను ప్రేరేపించేలా, గొడవలు సృష్టించేలా ఈ యాడ్ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇలాంటి యాడ్స్ ప్రచారానికి ఎన్నికల సంఘం ఎలా అనుమతి ఇచ్చిందంటూ రచ్చ అవుతోంది.