Movies

విజయ్ ఏసుదాస్ విజయం వెనుక అసలు రహస్యం ఇదే… తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నాడా?

‘లెజెండ్’ సినిమాలోని ‘నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే..’ అనే పాట వింటుంటే ఎక్కడో తెలియాడుతున్నట్లు ఉంటుంది. మంచి గాయకుడు పాడితే అలానే ఉంటుంది. ఈ గీతం పాడింది ఎవరో కాదు ప్రముఖ గాయకుడు కె జె ఏసుదాస్ కుమారుడు విజయ్ ఏసుదాస్. అసలు ఎలాంటి గీతాలనైనా కేజే ఏసుదాస్ నోటివెంట వింటే శ్రోతలు పులకించిపోతారు. అలాంటి స్వరమాధుర్యాన్ని పంచిన సుమధుర గాయకుడు అయన. మరి అలాంటి గాత్రమే ఆయన కుమారుడు కూడా పొందాడు. అందుకే తండ్రి బాటలో నడిచి దక్షిణ భారత సినీ సంగీత ప్రేమికులకు విజయ్ ఏసుదాస్ బాగా చేరువైపోయాడు.

తెలుగులో తక్కువ పాటలే పాడిన ప్పటికీ ఆ పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘ప్రేమమ్’ సినిమాలోని ‘ఎవరే ప్రేమను మాయంది..’ అనే పాట విజయ్ ఏసుదాస్ పాడిందే. ఈ పాటను చాలామంది విన్నారు, ఇంకా వింటున్నారు. ఈ పాటను రోజుకు ఒక్కసారైనా వినేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ స్వరంలో ఉన్న మాయ అలాంటిది మరి. ఇక విజయ్ ఏసుదాస్ అన్ని భాషలలో కలిపి 300 లకు పైగా పాటలు పాడారు.

కే.జే. ఏసుదాస్ కి విజయ్ రెండవ సంతానం. చిన్నప్పుడే లీకర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాడు. ఆపై చదువును విదేశాల్లో పూర్తిచేసాడు. 2007 లో దర్షన అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం గాయకుడిగా /నటుడుగా కొనసాగుతున్నాడు. తమిళంలో ధనుష్ నటించిన ‘మారి’ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రలో కనిపించాడు. అలాగే 2018 లో వచ్చిన తమిళ చిత్రం ‘పడైవీరన్’ ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

2002 లో ‘మిలీనియం స్టార్స్’ అనే మలయాళ చిత్రం ద్వారా గాయకుడిగా తన స్వర ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.యువన్ శంకర్ రాజా కంపొజిషన్ లో విజయ్ ఏసుదాస్.. ఎన్నో పాటలు పాడాంతో పాటు రెహ్మాన్, మణిశర్మ, కీరవాణి, విద్యాసాగర్, ఇళయరాజా వంటి అతిరథ మహారధుల సంగీత సారథ్యంలో కూడా అనేక పాటలను పాడి మెప్పించాడు. ఇప్పటివరకు 3 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 4 సైమా అవార్డ్స్ ను దక్కించుకున్నాడు. తెలుగులో ఆయన పాడిన ‘లెజెండ్’ సినిమాలోని పాటకు నంది అవార్డు అందుకున్నాడు.