Movies

జనసేనలో చేరికపై స్పందించిన రేణు దేశాయ్

ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. ఇండస్ట్రీలో చూడముచ్చటైన జంటగా పేరుపొందిన పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ ఇద్దరు పిల్లల్ని కన్నాక విడాకులు తీసుకున్నారు. దాంతో ఆమె పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. పవన్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాగానీ రేణు స్పందించలేదు. అయితే ఆ మధ్య రెండో పెళ్ళికి రేణు సిద్ధపడి, నిశ్చితార్ధం చేసుకుంది. కానీ అతనెవరో మాత్రం మీడియాకు పొక్కకుండా జాగ్రత్త పడింది. అయితే రేణుకి సంబంధించి ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది. జనసేన తరపున ఆమె ప్రచారం చేస్తారన్నది దాని సారాంశం.

పవన్ తో విడిపోయాక మీడియాకు దూరంగా మసలుతున్న రేణు, ఆ మధ్య ఏపీలో పర్యటించారు. రైతులు సమస్యలపై తన డైరెక్షన్ లో ఓ సినిమా తీయడం కోసం ఆమె పర్యటించారు. అయితే అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే జిల్లాలో టూర్ చేస్తున్నాడు. దీంతో పవన్ కి వ్యతిరేకంగా రేణు ప్రచారం మొదలెట్టిందన్న టాక్ పవన్ ఫాన్స్ నుంచే బయలు దేరింది. అయితే ఆమె జనసేనకు అనుకూలంగా ప్రచారం సాగిస్తోందని పవన్ అభిమానులు కొందరు అభిప్రాయపడ్డారు.

ఇక కొన్ని రోజులనుంచి కనిపించకుండా నున్న రేణు ఓ సందర్భంలో పవన్ మంచి గొప్ప రాజకీయ నాయకుడవుతాడని మాత్రం చెప్పింది. దీంతో జనసేనలో రేణు చేరతారని,పార్టీ తరపున రాష్ట్రమంతా తిరిగి ప్రచారం నిర్వహిస్తారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై రేణు స్పందిస్తూ రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని,పిల్లలతో కల్సి విదేశాల్లో హాలిడే ట్రిప్ లో ఉన్నామని పేర్కొంది. ఇక తన జీవితంలో జరిగిన అనుభవాలు, తాను నేర్చుకున్న గుణపాఠాలు గురించి ఇటీవల ఆమె ఓ పుస్తకం కూడా రాసింది.