Tati Tegalu :తరచూ తాటి తేగలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Tati Tegalu :తరచూ తాటి తేగలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. తాటి తేగలు ఒకప్పుడు ఎక్కువగా పల్లెటూర్లలో దొరికేవి. అయితే ఇప్పుడు అన్ని చోట్ల సులువుగా లభ్యం అవుతున్నాయి. అసలు తాటి తేగలు ఎలా వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. తాటి తేగల ఉత్పత్తిలో అసలు పురుగు మందుల వినియోగం అసలు ఉండదు.
ఒక రకంగా చెప్పాలంటే కల్తీ లేని ఆహారంగా తాటి తేగలను చెప్పవచ్చు. తాటి తేగలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు. తాటిచెట్లకు ముంజల గెలలు ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడు కోసి అందులోని ముంజలను తింటారు. కోయకుండా వదిలేస్తే అవి పండ్లుగా మారి నేలపై రాలి పడతాయి. కొన్ని సహజంగానే మొలకెత్తుతాయి. మరికొన్నిసార్లు వీటిని సేకరించిపొలాల ఒడ్డున, నీరుపారే ప్రాంతంలో పాతిపెడతారు.
అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో వాటిని తవ్వి తీసి ఆకులు కట్ చేసి కాండాన్ని కుండలో ఉడకబెడతారు లేదా మంటపై కాలుస్తారు. ఆ తరువాత వాటి మీది పొరను తొలగిస్తారు. ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి.తాటి తేగలను నిల్వ చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ఉడికించిన టేగలను రెండుగా చేసి ఎండలో ఆరబెట్టాలి.
తేగలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టవచ్చు. ఉడికించి ఆరబెట్టిన వాటిని పిండిగా మార్చవచ్చు. సాధారణంగా ఎండిన ముక్కలుగా నిల్వ ఉంచి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. ఇలా చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. ప్రస్తుతం తాటి టేగలతో రవ్వ, బిస్కెట్‌లు, కేక్‌లు, న్యూడిల్స్ కూడా తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు.
తాటి టేగలలో కొవ్వు శాతం చాలా తక్కువగాను,పీచు శాతం అధికంగాను ఉంటుంది. తేగలు మంచి పౌష్టికాహారం కూడా వాటిలో 60% పిండి పదార్థంతో పాటు పీచు పదార్థం కూడా వుంటుంది. వాటిని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాహారంగా చెప్పవచ్చు. అనేక రకాల సూక్ష్మధాతువులు ఇందులో లభ్యమవుతాయి.
తాటి టేగలలో పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. పిల్లలో ఎముకల ఎదుగుదలకు చాలా బాగా సహాయాపడుతుంది. కాబట్టి తాటి టేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్ గా వీటిని పెడితే మంచిది. పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం. తాటి టేగలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో కొలస్ట్రాల్ కూడా నిల్వ లేకుండా బయటకు పోతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే. తాటి టేగలలో కొవ్వు శాతం తక్కువ పీచు శాతం ఎక్కువగా ఉండుట వలన బరువు తగ్గేవారికి దివ్య ఔషధం అని చెప్పాలి. తాటి టేగలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించి మధుమేహం కంట్రోల్ గా ఉండేలా చేస్తుంది.
తాటి టేగలను ముక్కలుగా చేసుకొని నమలడం వలన నోటి సంబందిత సమస్యలు అన్ని తొలగిపోతాయి. రక్త వృద్ధి జరుగుతుంది. రక్తం తక్కువగా ఉంది అనీమియాతో బాధపడుతున్న వారు రెగ్యులర్ గా తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. చర్మ వ్యాధులు వ్యాపించకుండా సహాయపడుతుంది. అలాగే కాలేయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తాటి తేగలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News