Kitchen

Senagala Patoli :కూరలు లేనప్పుడు శనగపప్పు తో పాఠోళీ చేయండి

Senagala Patoli :కూరలు లేనప్పుడు శనగపప్పు తో పాఠోళీ చేయండి.. ఎర్ర శ‌న‌గ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. శ‌న‌గ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే.

వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ల‌తో పాటు, క్యాల్షియం, ఐర‌న్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ శ‌న‌గ‌ల‌తో గుగ్గిళ్లు, కూర వంటి వాటినేకాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే పాటోలిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.

కావలసినవి:
శనగలు – 150గ్రా
పచ్చిమిర్చి – 3
పచ్చిమిర్చితరుగు – మూడు టీస్పూన్లు
ఉల్లిపాయ – 1
ఉల్లితరుగు – అర కప్పు
ఉప్పు – తగినంత
జీలకర్ర – టీ స్పూను
నూనె – చిన్న గిన్నెడు
కరివేపాకు – నాలుగు రెమ్మలు
ఆవాలు – టీ స్పూను
శనగపప్పు – టీ స్పూను
మినప్పప్పు – టీ స్పూను
అల్లం ముక్క – చిన్నది
అల్లం తురుము – టీ స్పూను
ఎండుమిర్చి – 6

తయారు చేయు విధానం
శనగలను ఒకరోజు ముందు రాత్రంతా నానబెట్టాలి. నానిన శనగలను శుభ్రంగా కడిగి నీరు మొత్తం తీసివేసి మిక్సీలో వేసి బరకగా(మెత్తగా కాకుండా) రుబ్బాలి. రుబ్బుతున్న సమయంలోనే పచ్చిమిర్చి,అల్లం,ఉల్లిపాయ,ఉప్పు,జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఒక బాండిలో నూనె పోసి అది కాగాక అందులో ఎండుమిర్చి, మినప్పప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, అల్లంతురుము,పచ్చిమిర్చితరుగు, కరివేపాకు వేసి వేగించాలి.

ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లి తరుగు వేసి వేగించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న ముద్దను వేసి అన్నింటిని బాగా కలిపి మూత పెట్టాలి. మంట బాగా తగ్గించి పెట్టాలి. దీనిని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి. దీనికి నూనె ఎక్కువగా అవసరం అవుతుంది. ఒక అరగంట అయిన తర్వాత ఈ మిశ్రమం విడివిడి లాడినట్లు అవుతుంది. అప్పుడు పొయ్యి మీద నుంచి దించేయాలి. దీనిని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News