Movies

“మహర్షి”..”అరవింద సమేత” సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఉన్నంత ఆనందం ఎవ్వరికీ ఉండదనే చెప్పాలి.ఎందుకంటే వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న “మహర్షి” టీజర్ తాలుకా అప్డేట్ రానే వచ్చింది.ముందు నుంచి వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ ఏప్రిల్ 6న ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నామని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించేసారు
Maharshi mahesh babu
అయితే ఈ ప్రకటనల విషయానికి వచ్చినట్టయితే మహర్షి టీమ్ అరవింద సమేత సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారా అన్న సందేహం కలుగుతుంది.ఎందుకంటే తాజాగా ఇస్తున్న అప్డేట్స్ తాలూకా టైమింగ్ చూస్తే అలానే అనిపిస్తుంది.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అయినటువంటి ‘చోటి చోటి బాతే” ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేసారు.అలాగే ఇప్పుడు విడుదల చెయ్యబోయే టీజర్ కి కూడా 6 వ తేదీన ఉదయం ఇదే టైం ఫిక్స్ చేసారు.ఈ నంబర్స్ కాస్త జాగ్రత్తగా గమనిస్తే అందరు లక్కీ నెంబర్ గా భావించే 9 అంకె వస్తుంది.

9+9 = 18..1+8 = 9.ఇది జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ కూడా అందుకే “అరవింద సమేత” అప్డేట్స్ కూడా ఇలాగే 4 గంటల 50 నిమిషాలకో లేదా 05 నిమిషాలకో విడుదల చేసేవారు.ఇప్పుడు ఇదే లక్కీ నెంబర్ 9 సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారా అని అనుకోవచ్చు.ఒకవేళ ఇది కాకపోయినా ఈ సినిమాను మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.అందుకని ఆ డేట్ బాగా నోటీస్ అవ్వడానికి ఇలా చేస్తున్నారేమో కానీ మొత్తానికి సెంటిమెంట్ ను అయితే ఫాలో అవుతున్నారనే చెప్పాలి.