Movies

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో బాలకృష్ణ గా నటించిందెవరో తెలిస్తే షాకవ్వాలి…. బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో రామ్ గోపాల్ వర్మ చూపించిన ప్రతి పాత్ర వాస్తవ పాత్రలకు దగ్గరగా ఉన్నాయనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. పైగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను బాలకృష్ణకు రామ్ గోపాల్ వర్మ అంకితం ఇవ్వడం విశేషం. 1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాను తనదైన కోణంలో చంద్రబాబు పాత్రను విలన్‌గా చిత్రీకరించి, లక్ష్మీ పార్వతి పాత్రను ఉదాత్తమైనదిగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చూపించడం కొంత మందికి నచ్చకపోయినా, మొత్తంగా చూస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. వర్మ తనకు తెలిసినదాన్ని, తాను నమ్మినదాన్నిఈ సినిమాలో చూపించాడు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించిన స్టేజ్ యాక్టర్ విజయ్ కుమార్ నటనను అందరు మెచ్చుకుంటున్నారు.

మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ను కూడా అందరు మెచ్చుకుంటున్నారు.అచ్చం అన్నగారిలా విజయ్ కుమార్ నటన, మరోవైపు డబ్బింగ్ నటుడు విశ్వ..అచ్చు ఎన్టీఆర్‌లా చెప్పిన గాత్రం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.ఈ విధంగా ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణను పాత్రను చేసిన నటుడు ఎవరో కాదు.

విజయవాడకు చెందిన బాలు. వృత్తిరీత్యా ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోన్న బాలుకి వర్మ పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చాడు. అంత వరకు బాగానే ఉన్న ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను ఒక కమెడియన్‌గా చిత్రీకరించడాన్ని మాత్రం బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేక వర్మ పై కారాలు మిరియాలు నూరుతున్నారట. మరోవైపు చంద్రబాబు పాత్ర చేసిన శ్రీతేజ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి.