Devotional

ఏ జన్మలో ఏ పాపం చేసారో కానీ ఉగాది నుండి ఈ 4 రాశుల వారికి కష్టాలు తప్పవు… మీ రాశి ఉందేమో

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది మార్చి 25 నుండి గ్రహ స్థితుల కారణంగా 4 రాశులవారికి కష్టాలు ఎదురు కాబోతున్నాయి. ఆ రాశుల వారు ఎవరో, ఎటువంటి కష్టాలు,సమస్యలను ఎదుర్కోబోతున్నారో వివరంగా తెలుసుకుందాం.

ధనస్సు రాశి

ధనస్సు రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు అనుకూలంగా లేకపోవటం మరియు శని కూడా సమస్యలను తెచ్చిపెట్టానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల కోర్టు కేసులు,పోలీస్ కేసులు అంటూ కొన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయి. తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ద పెట్టాలి. లేకపోతే అనుకోని సమస్యలు వస్తాయి. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన వాటి కోసం డబ్బు ఖర్చు చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గొంతుకు సంబందించిన, పొట్టకు సంబందించిన సమస్యలు వస్తాయి. కుటుంబంలో కలతలు వస్తాయి. శనికి ప్రత్యేకంగా పూజలు చేయిస్తే సమస్యల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది.

మకర రాశి

మకర రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఎన్నో సమస్యలు ఎదురు అవుతాయి. దైర్యంగా ఎదుర్కోవాలి. ఖర్చులు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ అవమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ద ఎక్కువగా పెట్టాలి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఉన్న ఉద్యోగంలోనే ఉంటేనే మంచిది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మకర రాశివారికి ఏలినాటి శని ఉండుట వలన శని కారణంగా తీవ్రమైన సమస్యలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పరిస్థితి ఎలా ఉన్నా చేతిలో డబ్బు సమస్య ఉండదు. మకర రాశివారు శనీశ్వరుణ్ణి పూజిస్తే సమస్యల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారు నల్లని బట్టలను ధరించకూడదు.

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఊహించని ఖర్చులు ఎన్నో పెరుగుతాయి. అంతేకాక అవమానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారికి మోకాళ్ళ నొప్పులు,ఒంటి నొప్పులు విపరీతంగా బాధిస్తాయి. ఉద్యోగం చేస్తున్నవారు ఉన్నత అధికారులతో సమస్యలను ఎదుర్కొంటారు. కర్కాటక రాశివారికి గురుడు,శని అనుకూలముగా లేకపోవటం వలన అసహనం,కోపం పెరిగిపోతుంది. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకుండా చూసుకోవటం మంచిది. దక్షిణామూర్తిని దర్శించుకోవటం వలన సమస్యల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారు శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆకుపచ్చ,పసుపు రంగు దుస్తులను ధరిస్తే మంచిది.

సింహ రాశి

సింహ రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఊహించని ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి కొంత మంది మెచ్చుకున్నా, ఎక్కువ మంది ఈ రాశివారిని తిట్టుకుంటూ ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంతో మీకు నరఘోష ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఆలా అని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడటం అలవర్చుకోవాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చిన దైర్యంగా ఎదుర్కొంటారు సింహ రాశివారు.