Movies

లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు యమదొంగలో కీలక పాత్రలోచేసాడని తెలుసా?

తెలుగు నాట అప్పుడూ ఎప్పుడూ అగ్రశ్రేణి నటుడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించాక అసలు ఏం జరిగింది?ఎన్టీఆర్ చివరిరోజుల్లో ఎలా గడిచాయి? వంటి అంశాలతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ చిత్రం ఏపీలో మినహా మిగిలిన చోట్ల విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్స్ బాగున్నాయి. అయితే ఈ మూవీలో అచ్చం ఎన్టీఆర్ లా నటించిన నటుడు ఆడియన్స్ ని బాగా మెప్పించడమే కాదు. అతడి గురించి అన్నిచోట్లా చర్చించుకుంటున్నారు. అతని పేరు పి.విజయకుమార్. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన తన నటనతో అచ్చం ఎన్టీఆర్ ని చూసిన ఫీలింగ్స్ కలిగించి ఆడియన్స్ మదిలో చెరగని ముద్రవేసాడు. అసలు ఎన్టీఆర్ పాత్ర వేస్తానని ఎప్పుడూ అనుకోలేదని విజయకుమార్ అంటున్నారు.

మూడు నెలల పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్ జరిగింది. ఎక్కువగా ముంబయిలో ,మైసూర్ లో కొంత షూటింగ్ చేసారు. ఊరేగింపుల సీన్స్ సిద్ధిపేటలో చిత్రీకరించారు. ఒకప్పుడు సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదని, అయితే వర్మ పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చారని విజయకుమార్ తాజాగా ఓ ఇంటర్యూలో చెప్పారు. ఇక గతంలో ఎన్నో ఫోటోలు పంపించి విసుగుచెందిన తనను , ఈ సినిమా తర్వాత కొందరు ఫోటోలు పంపమని అడుగుతున్నారని అయితే పంపడం లేదని చెప్పారు.

నిజానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ కన్నా ముందే జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా కోసం డైరెక్టర్ రాజమౌళి తనను పిలిపించారని, అందులో తారక్ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళినపుడు ‘ఏమిటి మనవడా ఇలా వచ్చావ్’ అంటూ అడిగిన సీన్ తానె చేశానని అయితే గ్రాఫిక్ లో మార్చేసి చూపించారని చెప్పుకొచ్చారు. నిజానికి విజయకుమార్ అక్కడికే వెళ్ళేటప్పటికే లాప్ టాప్ లో ఆసీన్ రెడీగా ఉందట. ఆల్ రెడీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారని అడిగితె, కేవలం గ్రాఫిక్స్ లో నీ నీడ ఉపయోగించుకోడానికి పిలిచామని అక్కడ ఒకాయన చెప్పారని విజయకుమార్ వాపోయాడు.

అయితే నన్నెందుకు పిలిచారని ప్రశ్నించానని గుర్తుచేసుకున్నారు. అందుకే ఆతర్వాత రాజమౌళి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా అప్పటినుంచి సినిమాల్లో నటించలేదని వివరించారు. ఇక విజయ కుమార్ ది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. అక్కడే పుట్టి పెరిగినప్పటికీ పోలవరం దగ్గర కొయ్యలగూడెంలో వ్యాపార రీత్యా సెటిల్ అయ్యారు. అక్కడే డ్రామా ఆర్టిస్ట్ కూడా అయ్యారు. కొయ్యల గూడెం విజయకుమార్ గా ప్రసిద్ధిచెందారు. అక్కడ నాటక సమాజాలుండేవి.

సినీ నటి అన్నపూర్ణ లాంటివాళ్లు నాటకాలు వేయడానికి అక్కడికి వెళ్లేవారు. 45ఏళ్ళ కెరీర్ లో ఇప్పటిదాకా 4500నాటకాలు ఆడారు. ఏడాదికి 150చొప్పున నాటకాలు వేసిన రోజులున్నాయి. అయితే ఎక్కువగా పౌరాణిక నాటకాలు వేసేవారు. ఇక నాటకానుభవం కారణంగా ఎన్టీఆర్ పాత్ర చేయగలిగామని ఆయన అంటారు.