Devotional

ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది… మీ రాశి ఉందేమో?

ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి సూర్యుడు మేష రాశి సంచారం ప్రారంభం అవుతుంది. ఈ విధంగా సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించటం వలన ఇప్పుడు చెప్పబోయే నాలుగు రాశులవారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఈ రాశులవారికి ఈ కాలం చాలా అద్భుతమనే చెప్పాలి.

మేష రాశి 

గ్రహాలకు అధిపతి అయిన సూర్య గ్రహం ఏప్రిల్ 14  శ్రీరామనవమి నుండి మేష రాశిలోకి ప్రవేశించటం వలన ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. సూర్య గ్రహం అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్నత స్థితికి చేరటం మరియు ఆరోగ్య పరంగా బలంగా ఉండటం, మనం ఉన్న రంగంలో పేరు ప్రతిష్టలు రావటం,ఎటువంటి కష్టమైన సమస్యలు రావు.

సూర్య గ్రహ అనుగ్రహం లేకపోతే కోరుకున్న కోరికలు ఏమి నెరవేరవు. చేసే పనిలో ఆటంకాలు ఏర్పడి పనులు కూడా పూర్తీ కావు. ఎంతమందికి సాయం చేసిన పెద్దగా ఫలితం ఉండదు. సూర్య గ్రహం అనుగ్రహం ఉంటే మనకు ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. రాజకీయ రంగంలో పై స్థితికి ఎదగాలంటే సూర్య గ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.

గణపతి హోమం చేయించుకుంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే  ప్రతికూల శక్తుల తీవ్రత కూడా తగ్గుతుంది. అంతేకాక మనకు వచ్చే సమస్యలకు పరిష్కారం కూడా తొందరగా దొరుకుతుంది. వీరు చేసే పనులలో విజయాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చి మంచి స్థితికి చేరతారు. ఆరోగ్యం బాగుంటుంది. వీరు ప్రతి విషయంలోనూ చాలా బలంగా ఉంటారు.ఈ రాశివారికి ప్రతి దాన్ని నేర్చుకోవాలనే ఆరాటం ఎక్కువగా కనపడుతుంది. ఈ రాశివారు చాలా చురుకుగా తెలివైన ఆలోచనలను చేస్తారు.

కర్కాటక రాశి

ఈ రాశివారికి ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి మంచి పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని శ్రీరామనవమి నుండి తీరిపోతాయి. ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దాంతో జీవితంలో కాస్త ప్రశాంతత దొరుకుతుంది. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగం విషయంలో చాలా తృపిగా ఉంటాయి. కోరిన చోటుకి ప్రమోషన్స్ వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి మాటకు విలువ పెరుగుతుంది.

సింహ రాశి

ఈ రాశివారికి  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నవారు అయితే వీరికి మంచి కాలమనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగంలో భాగంగా విదేశీ యానం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక ప్రమోషన్స్ వస్తాయి. ఈ రాశివారికి ప్రతి పనిలోనూ ఆసక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. వీరు చేసే ప్రయాణాలు ఎటువంటి ఇబ్బంది కలిగించవు. లాభాన్నిచేకూరుస్తాయి . ఈ రాశివారు ఏప్రిల్ 14 శ్రీరామనవమి నుండి చాలా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు. ఇంటిలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వీరు చాలా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రాశివారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి సూర్య గ్రహ సంచార ప్రభావం చాలా ఎక్కువగానే కనపడుతుంది. ఈ రాశివారికి ఉన్న కష్టాలు తొలగిపోతాయి. వీరి గ్రహ స్థితి కారణంగా ఇంటిలో ఎన్నో శుభకార్యాలను చేస్తారు. ఇంట,బయట మంచి పేరు సంపాదిస్తారు. ఈ గ్రహ సంచారం కారణంగా ఈ రాశివారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఆర్ధికంగా కూడా స్థిరపడతారు. ఈ రాశివారికి ఏ పని చేసిన కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. దాంతో వీరు  లక్ష్యాలను చాలా తక్కువ సమయంలోనే సాధిస్తారు.