Politics

సుధీర్ పై మండిపడ్డ రోజా

ఏప్రియల్ 11న ఏపీలో జరిగిన లోకసభ,శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఆయా పార్టీల ప్రచారం,పోలింగ్ రోజున మేనేజ్ మెంట్ వంటివాటితో నిమగ్నమై ప్రస్తుతం సేదదీరుతున్నారు. మే23న కానీ లెక్కింపు ఉండకపోవడంతో దాదాపు 40రోజులపాటు ఉత్కంఠ తప్పదు. అయితే ఎన్నికల సాందర్బంగా సాగిన ప్రచారంలో అభ్యర్థుల తరపున జోరుగా సాగిన ప్రచారంలో అభ్యర్థుల బంధువులు, మిత్రులు,సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తరపున చాలామంది ప్రచారం చేసారు.

అందునా భీమవరం అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్,నరసాపురం పార్లమెంట్ బరిలో మెగా బ్రదర్ నాగబాబు పోటీ పడ్డారు. వీరి విజయం కోసం జబర్దస్త్ టీమ్ లో కొందరు ప్రచారం చేసారు. ఈ షో ద్వారా పరిచయం కావడంతో పాటు ఢీ షో ద్వారా మరింత పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వారం రోజులపాటు జనసేన తరపున ప్రచారం చేసారు. రాజకీయాల్లో మార్పుకోసం ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని కోరారు. ఉన్నత ఆశయాలు గల పవన్ సీఎం గా ఎన్నికైతే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని సుధీర్ తన ప్రసంగాల్లో పేర్కొన్నాడు.

అయితే నగరి నుంచి మరోసారి బరిలో దిగిన ఎమ్మెల్యే రోజా హఠాత్తుగా సుధీర్ పై మండిపడిందని టాక్. కాబోయే ఎపి సీఎం జగన్ మాత్రమేనని,మీ నాయకుడు సినిమాలు చేసుకోవాల్సిందేనని సుధీర్ కి రోజా తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. ప్యాకేజి కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారే తప్ప , ప్రజలకోసం కాదని రోజా గట్టిగా ఇచ్చుకుందని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."