Movies

అయ్యో.. జిగేల్‌ రాణి పరిస్థితి అలాగయ్యిందేంటబ్బా!

జిగేల్‌ రాణి’ అంటూ జోష్‌ చూపించిన పూజా హెగ్దే స్టార్‌ హీరోలతో ఛాన్స్‌ దక్కించుకుంటున్నా, ఆయా సినిమాల్లో ఆమె పాత్రకు పెద్దగా సీను లేకుండా పోతోంది. ‘అరవింద సమేత’లో టైటిలే ఆమె పేరుతో పెట్టినప్పటికీ, సినిమాలో మాత్రం పూజాని ఆశించిన స్థాయిలో చూపించలేకపోయారు. ఆకట్టుకునేలా పర్‌ఫామ్‌ చేయదగ్గ స్టామినా పూజాకు ఉన్నా, ఆమెని సరిగ్గా వాడుకోలేకపోయారు. అలాగే తాజా చిత్రం ‘మహర్షి’లోనూ పూజా పరిస్థితి అలాగే అయిపోయింది.

నిడివి తక్కువ. పర్‌ఫామెన్స్‌కి అస్సలు స్కోపు లేని పాత్ర అంటూ విడుదలయ్యాక పూజా క్యారెక్టర్‌ని బేలగా తేల్చేశారు. పూజా హెగ్దే విషయంలో ఇలా జరుగుతున్నందుకు ఆమె ఫ్యాన్స్‌ ఢీలా పడుతున్నారు. ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్‌తో అలా అయ్యింది. ‘మహర్షి’లో మహేష్‌తో ఇలా అయ్యింది. ఇక నెక్ట్స్‌ పూజా టార్గెట్‌ ప్రబాస్‌. ప్రబాస్‌ అయినా పూజాని ఆదుకుంటాడో లేదో చూడాలి మరి. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రబాస్‌ నటిస్తున్న సినిమాలో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క ‘సాహో’ సినిమా చేస్తూనే ప్రబాస్‌ ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. పూజా కూడా అంతే.

ఓ పక్క ‘మహర్షి’లో నటిస్తూనే, ప్రబాస్‌ సినిమా కూడా కవర్‌ చేస్తోంది. ఇప్పటికే సైలెంట్‌గా రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా పైనే పూజా హెగ్దే ఆశలన్నీ. మరోవైపు అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ మూవీలోనూ పూజా నటిస్తోంది. రీసెంట్‌గా సెట్స్‌పైకెళ్లిన ఈ సినిమాలోనైనా పూజాకి సీనుంటుందో లేదో విడుదలైతే కానీ తెలీదబ్బా.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."