Movies

“క్యాష్” నుంచి అనసూయకు వింతైన ఛాలెంజ్ విసిరిన సుమ.!

ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే మోస్ట్ ఎంటర్టైనింగ్ షో లలో యాంకర్ దిగ్గజం “సుమ” యాంకరింగ్ చేసే “క్యాష్” ప్రోగ్రాం కూడా ఒకటి.అయితే ఈ ప్రోగ్రాం కు ప్రతీ వారం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటులు ఎవరొకరు వస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే ఈసారి కూడా “ఏబీసీడీ” టీమ్ అదే అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా సినిమా చిత్ర బృందం వచ్చింది.ఇప్పుడు ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో ఇప్పుడే విడుదలైంది.

ఇక ఈ ప్రోమోలో చూసుకున్నట్టయితే గెస్టులుగా వచ్చిన శిరీష్ మరియు మాస్టర్ భరత్ లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.శిరీష్ అయితే మరీ ఎక్కువ పంచులు సైటైర్లతో అదరగొట్టేసారు.అలాగే సుమ మాత్రం ఒక వింతైన ఛాలెంజ్ ను తన సహా యాంకర్ అయినటువంటి అనసూయకు విసిరారు.

మనం అందరం ఎంతో ఇష్టంగా తినే తాటి ముంజెలు ఛాలెంజ్ వీరందరూ చేసారు.సుమ అయితే మరీ ఎక్కువగా వారితో పోటీ పడి తినేశారు.ఇదే తాటి ముంజెల ఛాలెంజ్ ను తాను యాంకర్ అనసూయకు ఇస్తున్నాని సవాల్ విసిరారు.మరి ఈ ఎపిసోడ్ ఇంకెంత అల్లరిగా నడిచిందో తెలియాలంటే వచ్చే జూన్ 1 శనివారం రాత్రి 9:30 నిమిషాలకు ఈటీవీ ఛానెల్లో చూడాల్సిందే.