Sports

వరల్డ్‌కప్‌లో మళ్లీ హ్యాట్రిక్ తీస్తా: మలింగ

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొడతానని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ధీమా వ్యక్తం చేశాడు. 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై నిప్పులు చెరిగిన లసిత్ మలింగ.. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2019 సీజన్‌లోనూ ముంబయి ఇండియన్స్ టీమ్‌ టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మలింగ.. ఇంగ్లాండ్‌ పిచ్‌ పేసర్లకి అనుకూలిస్తుందని చెప్పుకొచ్చాడు. 15 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటికే 218 వన్డేలాడిన మలింగ.. 322 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 8 సార్లు ఐదుకిపైగా వికెట్లు పడగొట్టడం విశేషం. 35 ఏళ్ల ఈ యార్కర్ల స్టార్‌కి ఇదే చివరి ప్రపంచకప్‌ అయ్యే అవకాశముంది. 

‘ప్రపంచకప్ 2019లోనూ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాను. ఒకవేళ హ్యాట్రిక్‌ సాధించగలిగితే.. అది నాకు చాలా ప్రత్యేకంకానుంది. ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. అక్కడి పరిస్థితులకి అలవాటుపడటం చాలా కీలకం. ఎందుకంటే.. ఆ గడ్డపై ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి.. అలానే చలి తీవ్రత కూడా ఉంటుంది. ముఖ్యంగా.. బౌలర్లకి ఇది కఠిన పరీక్ష’ అని మలింగ వెల్లడించాడు. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."