Kitchenvantalu

నల్లగా మాడిపోయిన గ్యాస్ స్టవ్ బర్నర్స్.. చేత్తో రుద్దే పనిలేకుండా 5 నిమిషాల్లో కొత్తవాటిలా తళతళా మెరవాలంటే ఇలా చేయండి!

GAs Stove Cleaning:వంట చేసేటప్పుడు పాలు, టీ, కూరలు పొంగి గ్యాస్ స్టవ్ బర్నర్ల మీద పడుతుంటాయి. క్రమంగా ఆ బర్నర్స్ రంధ్రాలు మూసుకుపోయి, మంట సరిగ్గా రాక గ్యాస్ వృధా అవుతుంది. మాడిపోయిన ఆ బర్నర్లను సోపు పెట్టి ఎంత గట్టిగా రుద్దినా నలుపు వదలదు. కానీ, ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగిస్తే నిమిషాల్లో మీ గ్యాస్ బర్నర్స్ కొత్తవాటిలా మెరుస్తాయి.

కావాల్సిన పదార్థాలు:
ఈనో ప్యాకెట్ (Eno Fruit Salt) – 1
నిమ్మకాయ – 1
వేడి నీళ్లు – 1 గ్లాసు
డిష్ వాష్ లిక్విడ్ లేదా షాంపూ – 1 స్పూన్
పాత టూత్ బ్రష్

క్లీనింగ్ ప్రాసెస్:
ముందుగా ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్ తీసుకుని అందులో నల్లగా మారిన గ్యాస్ బర్నర్లను పెట్టాలి.బర్నర్లు మునిగేంత వరకు బాగా మరిగించిన వేడి నీళ్లను అందులో పోయాలి.ఇప్పుడు ఆ వేడి నీళ్లలో ఒక ఈనో ప్యాకెట్ (Eno) కత్తిరించి పూర్తిగా వేసేయాలి. ఈనో నీటిలో పడగానే నురగ వస్తూ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది.

వెంటనే అందులో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి, ఒక స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ వేసి కలపాలి. ఇలాగే 15 నిమిషాల పాటు వదిలేయాలి.

15 నిమిషాల తర్వాత బర్నర్లను బయటకు తీసి, పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దితే.. దానిపై ఉన్న నల్లటి జిడ్డు, కార్బన్ మొత్తం చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. చివరగా మంచి నీళ్లతో కడిగేస్తే మీ బర్నర్స్ కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."