Movies

శోభన్ బాబు గురించి ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు

చాలామంది హీరోలు తాము ఎదిగిన తర్వాత వారసులను రెడీ చేయడం,కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దృష్టి సారిస్తారు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అందం ,నటనతో ఎదిగిన అందాల నటుడు శోభన్ బాబు శైలి డిఫరెంట్ గా ఉంటుంది. కానీ శోభన్ బాబు తన వారసులను ఇండస్ట్రీకి తీసుకురాలేదు. జీవితంలోని చాలా విషయాలు కూడా బయటకు తెలియనివ్వలేదు. 
రహస్యాలను తనలోనే ఇముడ్చుకున్న శోభన్ బాబు గురించి ఇంట్లో కూడా పూర్తిగా ఎవరికీ తెలియదంటే నమ్మలేం కానీ నిజం.

అంతెందుకు తాను నటించే చిత్రం గురించి గానీ, ఏ షూటింగ్ వెళ్తున్నానో,ఆ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో వంటి విషయాలు ఇంట్లో ఎవరికీ చెప్పిన దాఖలాలు లేవట. ఇక షూటింగ్ నుంచి వచ్చాక అక్కడ జరిగే సంఘటనల గురించి చాలామంది హీరోలు ఇళ్లల్లో చెబుతారు. కానీ శోభన్ బాబు షూటింగ్ విషయాలను అసలు ఇంట్లో ప్రస్తావించేవారు కాదట. 

ఇక ఇండస్టీలో చాలామందికి మైనస్ పాయింట్స్ ఉంటాయి. కానీ శోభన్ బాబుకి అలాంటి మైనస్ పాయింట్స్ లేవు. మంచి పీక్ స్టేజ్ లో ఉండగానే సినిమాల నుంచి తప్పుకున్నారు. ఒకసారి తప్పుకున్నాక ఎన్ని వత్తిళ్లు వచ్చినా అసలు సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. అసలు సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అందుకే శోభన్ బాబు స్టైల్ డిఫరెంట్ అని అంటారు. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."