Politics

ఎమ్మెల్యే రోజా పూజలు ఫలించేనా? – పదవి ఖాయమా?

చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఘన విజయం సాధించిన వైకాపా ఎమ్మెల్యే రోజాకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, హోంమంత్రి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలయ్యాయి. అలాగే రోజాకు అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్‌లో షికారు చేస్తున్నాయి. 

రోజాను కేబినెట్ పదవి వరిస్తుందో, స్పీకర్ పదవి వస్తుందో కానీ ఆమె పూజలు మాత్రం అదరగొట్టేస్తున్నారు. హైదరాబాద్‌లో మణికొండలో పార్వతీసమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో రోజా మొక్కులు చెల్లించుకుంటూ బిజీ, బిజీగా ఉన్నారు. వేద పండితుల సమక్షంలో ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు చేయించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకం, గోమాతకు పూజలు చేశారు. 

హైదరాబాద్ మణికొండ పంచవటి కాలనీలో ఉండే రోజా, తరచూ ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. ఎన్నికలకు ముందు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకొని వెళ్లారట. నగరిలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడంతో, ఆమె మళ్లీ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."