PoliticsUncategorized

జగన్ తర్వాత నెంబర్ 2 స్థానం ఎవరిదో తెలుసా?

సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వైస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక ఫుల్ బిజీ అయ్యారు. ఓపక్క మేనిఫెస్టో అమలు,వివిధ పధకాల సమీక్ష,అధికారుల బదిలీలు ఇలా అన్నింటా తనదైన ముద్ర వేస్తూ బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉంటె,ఆయన తనయుడు కేటీఆర్ పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. కానీ ఏపీలో మొత్తం సమయాన్ని అంతా జగన్ ప్రభుత్వ పాలనమీద పెట్టేయడంతో ఇక పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారని అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. 

చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన తనయుడు లోకేష్ నెంబర్ టు బాధ్యతలను లోకేష్ చూసారు. అంతేకాదు కేంద్రంలో ప్రధాని మోడీ పాలనలో బిజీగా ఉంటె,అమిత్ షా అన్నీ తానై పార్టీని నడిపించారు. ఇప్పుడు కేంద్ర హోమ్ మంత్రిగా ఉంటూ పార్టీ బాధ్యతలు చక్కదిద్దుతున్నారు. ఇలా ఉంటె మరి వైసిపిలో నెంబర్ టు ఎవరని చర్చిస్తే ముందుగా జగన్ సోదరి షర్మిల పేరు వినిపిస్తుంది. 2012లో జగన్ జైలులో ఉండగా, నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల పార్టీని నడిపించిన తీరు పార్టీ శ్రేణుల అందరికీ గుర్తుంది. తన పాదయాత్ర ద్వారా పార్టీ కేడర్ లో జోష్ నింపారు. షర్మిల పాదయాత్ర ప్లస్ పాయింట్ అయింది. 

ఆతర్వాత సైలెంట్ అయినప్పటికీ 2014లో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం షర్మిల సాగించింది. ఇక 2019లో కూడా తల్లి విజయమ్మతో కల్సి ప్రచారం నిర్వహించింది. అయితే పార్టీలో క్రియాశీలకంగా లేకపోవడంతో ఆమె నెంబర్ 2పాత్రలో ఉండదని పార్టీ కేడర్ లో వినిపిస్తోంది. ఇక విజయసాయి రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ పేర్లు వైసిపి లో వినిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాలు,ఆర్ధిక వ్యవహారాలను విజయసాయి రెడ్డి చూస్తున్నారు. అందుకే నెంబర్ టు రేస్ లో ముందున్నారని అంటున్నారు. ఇక జగన్ తో సన్నిహిత సంబంధాలు నెరపుతూ ధర్మాన,బొత్స కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే వీరు ముగ్గురిలో ఒకరికి పార్టీ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది.