Movies

జయమాలిని,జ్యోతిలక్ష్మి ల మధ్య గొడవలకు కారణం ఇదే

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపేసిన జయమాలిని,జ్యోతిలక్ష్మి పాటలేని సినిమా ఆరోజుల్లో లేదంటే అతిశయోక్తి కాదు. అగ్ర హీరోలు సైతం వీళ్ళ పాటలు లేకుండా సినిమా ఉండరాదన్న నిర్ణయానికి అప్పట్లో వచ్చేసారు కూడా. అయితే వీళ్లిద్దరు అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ ఇద్దరికీ అసలు పడదట. కారణం ఏమిటంటే తండ్రి ఒక్కడే అయినా తల్లులు వేరట. వీళ్ళ తండ్రి పేరు టీజె రామచంద్రన్. మోత్తం తొమ్మిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి అందరికన్నా పెద్దది. అందరికంటే జయమాలిని చిన్నది. 

జ్యోతిలక్ష్మి , జయమాలిని లకు పదేళ్ల తేడా ఉండేది. ప్రముఖ నటి అయిన అత్త ధనలక్ష్మి దగ్గర జ్యోతిలక్ష్మి పెరిగింది. జయమాలిని మాత్రం తల్లి దగ్గరే పెరిగింది. సవతి తల్లుల దగ్గర గల విభేదాలే ఈ అక్కా చెల్లెళ్ల నడుమ మానసికంగా దూరం పెంచేసింది. జ్యోతిలక్ష్మి ముందుగానే సినీ రంగ ప్రవేశం చేసింది. డబ్బులున్నా సరే,జయమాలిని ఆర్ధిక ఇబ్బందులను చూసి ఆదుకోక పోగా, జయమాలినిని జ్యోతిలక్ష్మి చిన్నచూపు చూసేదట. ఇక 13ఏళ్ళ ప్రాయంలో జయమాలిని కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కాల్ షీట్స్ ఖాళీలేకుండా జ్యోతిలక్మి ఉంటే,సినిమాలు లేక జయమాలిని ఖాళీగా ఉండేది. 

దీనికి తోడు సన్నగా, పీలగా ఉండడం వలన జయమాలిని ఛాన్స్ లు వచ్చేవి కావట. అయితే కాలం ఒకేలా ఉండదు కదా. జ్యోతిలక్ష్మి ప్రేమ వివాహంతో జయమాలిని కి ఒక్కసారిగా ఛాన్స్ లు వచ్చి పడ్డాయి. క్లబ్ డాన్సర్ గా అక్కకన్నా ఎక్కువ సినిమాలు చేసి దుమ్మురేపింది. అదే సమయంలో వచ్చిన ఛాన్స్ లు వదిలేయడం వలన జ్యోతిలక్ష్మి ఆర్ధికంగా చితికిపోయింది. ఆతరువాత జ్యోతిలక్ష్మి పరిమితంగా కొన్ని సినిమాల్లోనే నటించింది. జయమాలిని కి ఎక్కడా ఇబ్బంది రాకుండా ఆమె అమ్మ,అన్నలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే జ్యోతిలక్ష్మీకి జ్ఞానోదయం అయింది. అనవసరంగా చెల్లిని దూరంగా పెట్టానని కుమిలిపోయింది. ఇక జయమాలిని కూడా బెట్టు చేయకుండా అప్పుడప్పుడు వెళ్లి అక్క కష్ట సుఖాలు చూసేది. ఇక జ్యోతిలక్ష్మి చనిపోయాక జయమాలిని దగ్గరుండి అంత్యక్రియలు జరిపించింది. చివరిలో ఒక్కటైనా మృత్యువు వారిని దూరం చేసింది.