PoliticsUncategorized

అనుక్షణం CM జగన్ వెంట ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?

ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్ పాలనలో తనదైన ముద్ర వేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అవినీతికి ఎవరు పాల్పడినా కుదరదని తేల్చేస్తున్నారు. ఆయా శాఖల అధికారులతో సమీక్షలు చేస్తూ,నిఖచ్చిగా వుండాలని కోరుతున్నారు. పాలనపై పట్టు పెంచుకునేందుకు బదిలీల పర్వం చేపట్టారు. ఐ ఏ ఎస్ ,ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తనకు అనుకూలంగా ఉన్నవారికి కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఎపి ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా నిజాయితీ పరుడైన విశ్రాంతి ఐ ఏ ఎస్ అధికారి అజయ్ కల్లమ్ ను నియమించారు. 

ఇక ముఖ్య మంత్రి పేషీలో కూడా అధికారులను మార్పు చేసారు. కృష్ణ మురళీని స్పెషల్ సెక్రటరీగా నియమించగా,డాక్టర్ హరికృష్ణను స్పెషల్ ఆఫీసర్ గా,ఇరగవరపు అవినాష్ ని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా,తలశిల రఘురాం ను సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గా నియమించారు. వైస్సార్ సిపి ఏర్పాటు నుంచి జగన్ కార్యక్రమాలను తలశిల రఘురాం పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ హరికృష్ణ వైఎస్ మరణించిన నాటినుంచి జగన్ తోనే ఉంటున్నారు. అనంతపురానికి చెందిన అయన కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేసారు. ఉస్మానియా నుంచి పిడియాట్రిక్స్ లో పిజి పూర్తిచేశారు. 

ప్రాక్టీస్ మొదలు పెట్టాక వైఎస్ మరణం తర్వాత జగన్ వెంటడాక్టర్ హరికృష్ణ ఉంటూ వచ్చారు. పదేళ్లుగా పార్టీలోనే ఉంటూ షర్మిల ,జగన్ పాదయాత్రలలో పాల్గొన్న ఏకైక నేతగా నిలిచారు. పాదయాత్ర సమయంలో డాక్టర్ల నివేదికలను పూర్తిగా పరిశీలించి జగన్ కి అందించేవారు. ఇప్పుడు సిఎంఓ ద్వారా సేవలు చేసే ఛాన్స్ ఆయనకు జగన్ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దగ్గరగా చూసిన డాక్టర్ హరికృష్ణ సిఎంఓ లో ఉండడం ప్రజలకు మేలు చేస్తుందని అంటున్నారు. ప్రజారోగ్యం విషయంలో సీఎం కి ఆయనే కళ్ళూ,చెవులు అనిచెప్పాలి.