PoliticsUncategorized

రోజా కోసం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా…???

వైస్సార్ సిపి అధికారంలోకి రావడంతో నగరి నుంచి రోజా రెండోసారి నెగ్గడంతో ఇక ఆమెకు కేబినెట్ లో బెర్త్ ఖాయమని అనుకున్నారు. ఇక ఆమె అభిమానులైతే రోజా కూడా మంత్రి పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మంత్రి వర్గంలో రోజాకు ఎలాంటి చోటు కల్పించకపోవడం తో అందరూ ఖంగు తిన్నారు. డామిట్ కథ అడ్డం తిరిగిందని అనుకున్నారు. అసలు రోజా విషయంలో జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని వారు అస్సలు ఊహించి ఉండరు. అందుకే రోజాకు మంత్రి పదవి దక్కక పోవడంతో చాలా మంది నిరాశకు లోనయ్యారు.

దీంతో రోజా కనీసం ప్రమాణ స్వీకారంకు కూడా వెళ్లక పోగా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో పెట్టుకుని హైదరాబాద్ లో ఉండిపోయారని తెలిసింది. అయితే ఇప్పుడు రోజా విషయంలో ఎవరెవరు అయితే బాధ పడుతున్నారో వారందరికీ శుభ వార్త అందే సూచనలు ఉన్నాయా అంటే అవుననే చెప్పాలని అంటున్నారు.తాజాగా వై ఎస్ జగన్ రోజాకు ఫోన్ చేసి అమరావతి రావాల్సిందిగా కోరడంతో రోజా హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తుంది.

ఇప్పుడు రోజా విషయంలో జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని,ఆమెకు మంత్రి పదవి దక్కకపోడంతో రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చే యోచనలో ఉన్నారని అయితే దీనిపైనే విజయసాయి రెడ్డితో కూడా జగన్ చర్చలు నడుపుతున్నారని ఒకపక్క ఎమ్మెల్యేగా ఉంటూ చైర్ పర్సన్ గా ఉండొచ్చో లేదో అన్న దానిపైనే కసరత్తులు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ వస్తే, రోజా ఇన్నాళ్లు పార్టీకోసం వెచ్చించిన శ్రమకు జగన్ తగిన ప్రతిఫలం ఇస్తున్నట్టే లెక్క. ఇక అధికారికంగా వార్త వస్తే ఆమె అభిమానులకు పండగే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."