Movies

బెల్లంకొండ ఏ స్టార్ అయ్యాడో తెలిస్తే షాక్ అవుతారు

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ సినిమాలు, వాటి ఫ‌లితాలు ఎలా ఉన్నా – శాటిలైట్ రూపంలో త‌న సినిమాల‌కు మంచి గిరాకీ ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కూ బెల్లంకొండ న‌టించిన సినిమాల‌న్నీ మంచి రేట్లు ద‌క్కించుకున్న‌వే. మ‌రీ ముఖ్యంగా హిందీలో సాయి సినిమాల‌కు మంచి గిరాకీ. తాజాగా త‌న కొత్త సినిమా `రాక్ష‌సుడు` శాటిలైట్ కూడా భారీ మొత్తానికి అమ్ముడైంది. హిందీ డ‌బ్బింగ్ శాటిలైట్ రూపంలో 12.5 కోట్లు వ‌చ్చాయి. తెలుగు శాటిలైట్ జెమినీ టీవీ రూ.6 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అంటే కేవ‌లం శాటిలైట్ రూపంలో 18.5 కోట్లు వ‌చ్చాయ‌న్న‌మాట‌.

ఈ సినిమా బ‌డ్జెట్ తో పోలిస్తే… ఇది అధిక‌మొత్త‌మే. బెల్లంకొండ సినిమాల‌కు ఉన్న అడ్వాంటేజ్ ఇదే. సినిమా ఎలా ఉన్నా, థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో డ‌బ్బులు వ‌చ్చినా. రాక‌పోయినా – శాటిలైట్ మార్కెట్‌లో మినిమం గ్యారెంటీ ఉంది. హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే పెద్ద హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ… డ‌బ్బులు వ‌స్తున్నాయి. బెల్లంకొండని శాటిలైట్ స్టార్ అని పిల‌వ‌డంలో త‌ప్పులేదేమో..?!

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."