Movies

మనసు మమత సీరియల్ లో నందిని గురించి మీకు తెలియని విషయాలు

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ అదరగొడుతున్నాయి. ఇందులో ఈటీవీలో ప్రసారం అయ్యే మనసు మమత సీరియల్ మంచి పాపులార్టీ తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్ లో నందిని పాత్రలో నటించిన వ్యక్తి పేరు శ్రావ్య శృతి. 1995అక్టోబర్ 21న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తల్లిపేరు విజయ. తండ్రి నల్లూరి సుధీర్ కుమార్ మ్యూజిక్ ,డైరెక్టర్ ఆర్టిస్టు కూడా. నందినికి రమ్య అనే ఓ సిస్టర్ ఉంది. ఈమె తండ్రి బాటలో సింగర్ అయింది. నందిని కూడా పాటలు బాగా పాడుతుందంట. చక్కని హాట్,మంచి రూపంతో ఆకర్షణీయంగా నందిని ఉంటుంది. 

మోడల్ గా చేసిన నందిని మనసు మమత సీరియల్ కన్నా ముందే మాటీవీలో ఉయ్యాలా జంపాల సీరియల్ లో నటించింది. జెమినిలో ప్రసారమైన తోడికోడళ్లు సీరియల్ లో నటించింది. తరవాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ లో మల్లికా పాత్రలో నటించింది. జెమినీలోనే కెవ్వు కబాడీ ప్రోగ్రాంలో కూడా నటించింది. ఈటీవీలో ప్రసారం అయిన ఆడదే ఆధారం సీరియల్ లో మాలిని దేవిగా నటించింది. తర్వాత మనసు మమత సీరియల్ లో నటించింది. 

ఇక ఈమె ఫేవరేట్ హీరో లు ఎవరంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. బాహుబలి హీరో ప్రభాస్.ఇక హీరోయిన్ అనుష్క అంటే చాలా ఇష్టం అని చెబుతుంది. మనసు మమత సీరియల్ తనకు మంచి గుర్తింపు నిచ్చిందని నందిని అంటుంది. ‘పాటలు వినడం,సినిమాలు చూడడం,డాన్సింగ్ చాలా ఇష్టం. ఇక సీరియల్స్ లో హీరోయిన్ కేరక్టర్ కన్నా విలన్ కేరక్టర్స్ చేయడం ఇష్టం’అని ఓ ఇంటర్యూలో నందిని చెప్పుకొచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."