Movies

మన్మధుడు 2 ఏ సినిమాకి కాఫీ… తెలిస్తే షాక్ అవుతారు

మన్మధుడు 2పై కాపీరైట్ గొడవ! తెలుగు సినిమాల విషయంలో కాపీ కొట్టడం ఎక్కువగా ఉటుందని తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గతంలో ఇలాంటి గొడవలు వస్తే అందరికీ పెద్దగా తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియా విస్తృత మవ్వడంతో ఇలాంటివన్నీ ఈజీగా అందరికీ తెల్సిపోతున్నాయి. ఎందుకంటే ఇంటర్నెట్ ,టెక్నాలజీ పెరగడంతో ఏ భాషా చిత్రాన్నైనా సులువుగా చూసేయొచ్చు. 

ఇలా పలు భాషా చిత్రాలు చూస్తున్నవాళ్ళకి ఎక్కడ ఏ సినిమా వచ్చింది,మన తెలుగులో వచ్చే సినిమా ఒరిజనల్లేనా వంటి వాటిపై కూడా ఆరా తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నాగార్జున తీస్తున్న మన్మధుడు 2విషయంలో కూడా ఇలాంటి వివాదం తెరపైకి తెస్తున్నారు. 13ఏళ్ళక్రితం వచ్చిన ఫ్రెంచి మూవీ ప్రయితే మిల్తా ఆధారంగా మన్మధుడు కథను రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఫ్రెంచి మూవీ లో 40ఏళ్ళవయస్సు వచ్చిన హీరోని పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్ళు వత్తిడి తేవడంతో ఇక తట్టుకోలేక బయట నుంచి ఓ అద్దె భార్యను తీసుకొచ్చి నమ్మిస్తాడు. అయితే కొన్నాళ్ళకు ఇద్దరి మధ్యా అనుబంధం పెరిగిపోతోంది అల్లుడు గారు నుంచి ,బావగారు బాగున్నారా దాకా చాలా సినిమాలు ఇలానే ఉంటాయి. అయితే ఈసినిమాలో హీరో అద్దెకు వస్తే, ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ అద్దెకు రావడం విశేషం. అయితే మన్మధుడు 2కాపీయా కాదా అనేది ట్రైలర్ వచ్చాక కానీ చెప్పలేం అని కొందరు క్రిటిక్స్ అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."