Movies

పవన్ పై విమర్శలు చేసిన స్టార్ కమెడియన్ కి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఎన్నికల వరకే రాజకీయాలని,ఆతర్వాత అందరూ కల్సి ఉండాలని అంటారు. పేరుకే ఇలా ఉంటుంది కానీ షరామామూలే. ఇక మొన్నటి ఎన్నికల్లో ప్రచారం సందర్బంగా టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ టీడీపీ, జనసేన పార్టీలపై తనదైన శైలిలో దుమ్మెత్తిపోశారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎలాంటి ప్రభావం చూపదని వ్యాఖ్యలు చేసాడు. అయితే ఆ కామెంట్స్ ఇపుడు ఆయన కెరీర్‌కు కొత్త కష్టాలు తీసుకొచ్చా యా అంటే అవుననే వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ,పృథ్వీ చాలా కామెంట్స్ చేశాడు .

ముఖ్యంగా ప్రజలకు ఎవరు కావాలో ప్రజలు తేలుస్తారని పృథ్వి అన్నాడు. అందుకు అనుగుణంగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన జనసేనాని రెండు సీట్లలో ఓడిపోవడాన్ని జనసేన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన పృథ్వీకి రాబోయే రోజుల్లో మెగా హీరోలు నటించే సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమనే వాదనలు తెరపైకి వచ్చాయి. 

తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో పృధ్వీ కోసం మాటల మాంత్రికుడు ఓ రోల్ అనుకున్నాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం దీన్ని వ్యతిరేకించడంతో పృధ్వీకి బదులుగా మరో కమెడియన్ ని దర్శకుడు త్రివిక్రమ్ రంగంలోకి దించబోతున్నాడట. వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన జీవిత రాజశేఖర్, అలీ లాంటి వాళ్లు లౌక్యంగా ప్రచారంలో పాల్గొంటే, పృధ్వీ నోటికొచ్చినట్లు మాట్లాడడం మెగాహీరోలను చాలానే బాధ పెట్టిందట. మెగాఫ్యామిలీ పై అనవసర విమర్శలు చేసిన పృథ్వీ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నట్టు అందరు మాట్లాడుకుంటున్నారు. అందుకే తమ సినిమాల్లో పృధ్వీకి అవకాశాలు ఇవ్వకుండా మెగా హీరోస్ అనధికార నిషేధం విధించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."