సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ బ్యాక్ గ్రౌండ్…. ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ గా వేసిన శరద్ కేల్కర్ వాస్తవానికి ఫిజికల్ ట్రైనర్. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో మరాఠీ కుటుంబంలో పుట్టిన యితడు ఎం బి ఏ చదివాడు. గ్వాలియర్ లో ఫిజికల్ ట్రైనర్ గా ఓ జిమ్ లో పనిచేసిన శరద్ జీవితం ముంబయిలో అడుగుపెట్టాక దశ తిరిగింది. సినీ జీవితంలోకి అడుగుపెడతానని ఊహించకపోయినా జరిగిపోయింది. ముంబయి వెళ్ళినపుడు శారీరకంగా ఫిట్ గా ఉండే శరద్ మిస్టర్ ఇండియా అందాల పోటీలో పాల్గొనవచ్చని తెలుసుకున్నాడు. 

మిస్టర్ ఇండియా పోటీలో పాల్గొని,చివరి వరకూ ప్రయత్నం చేసాడు. అక్కడ ఓటమి చెందినప్పటికీ మోడలింగ్ రంగంలో ఛాన్స్ లు వచ్చేలా చేశాయి. మోడలింగ్ లో అడుగుపెట్టిన నెలరోజుల్లో 25రాంప్ షోస్ లో మెరిశాడు. 2004లో దూరదర్శన్ ఫేమస్ సీరియల్ తో నటుడిగా ఎంట్రీ ఇచ్చేసాడు. అదే ఏడాది హల్ చల్ అనే హిందీ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. 20005లో మరాఠీ మూవీలో నటించాడు. 2012లో చినా అనే మరాఠీ మూవీతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ కోసం చాలామంది విలన్స్ ని పరిశీలించి చివరకు శరద్ కేల్కర్ ని సెలక్ట్ లా చేసింది. పవన్ కి సరిజోడీగా ఉంటాడని డైరెక్టర్ కె ఎస్ రవీంద్రన్ దృష్టి పెట్టాడు. ఇక పవన్ కూడా ఒకే చెప్పడంతో తెలుగులో నటించే ఛాన్స్ శరద్ కి వచ్చేసింది. అనుకున్నట్టే ఆ సినిమాకు న్యాయం చేసిన శరద్ , ఆతరువాత హిందీ ,మరాఠీ మూవీస్ పై దృష్టి పెట్టాడు. అంతేకాదు నటుడిగానే కాకుండా వందల కోట్ల వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాలకు హిందీ డబ్బింగ్ చెప్పి తానేమిటో రుజువు చేసుకున్నాడు.

రియాల్టీ షోస్ లో వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. ఇక అక్రోస్ సీరియల్ ద్వారా పరిచయం అయిన శరద్ ,అదే సీరియల్ లో నటించిన కీర్తి గైక్వాడ్ ని లవ్ చేసి 2005జూన్ 3న పెళ్లాడాడు. ఎన్నో సీరియల్స్ లో నటించిన కీర్తి మంచి నటిగా గుర్తింపు పొందింది. వీరికి 2014లో కేస అనే అమ్మాయి పుట్టింది.