Movies

ఊహించిన విధంగా క్రేజ్ తగ్గినా ఎన్టీఆర్ 9999…. గత ఐదు ఏళ్లలో తక్కువ రేటు

లక్కీ నెంబర్స్ కోసం సెలబ్రిటీలు,ప్రముఖులు ఎంతైనా విచ్చేస్తారు. ప్రతి మూడు నెలలకొకసారి కొత్త సిరీస్ మొదలవుతుంది. ఇందులో లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఒక్కో నెంబర్ కోసం 10వరకూ పోటీ పడతారు. పోటీలో రేటు పెరిగిపోతుంది. ఆమధ్య జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9999కోసం అక్షరాలా 10న్నర లక్షలు ఖర్చు చేసాడు. అయితే ఇప్పుడు కారుచౌకగా ఈ నెంబర్ దొరుకుతుందని రుజువైంది. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఎఫ్ ఎఫ్ 9999 నెంబర్ ని ఒక లక్షా 7వేలరూపాయిలకే విక్రయించారు. సరుకు రవాణా సంస్థ ఈ నెంబర్ ని సొంతం చేసుకుంది. ఇలా తక్కువకే దక్కించుకోవడం చాలా గ్రేట్ అంటున్నారు. 

ఎందుకంటే, 9999నెంబర్ కి ఎంత రేటు పలుకుతుందో వేరే చెప్పక్కర్లేదని ఎవరిని అడిగినా చెబుతారు. ప్రతియేటా 8నుంచి 10లక్షల రూపాయల ధర పలుకుతుందట. రికార్డుల్లో తేటతెల్లం అవుతోంది. అయితే కేవలం 5సంవత్సర వ్యవధిలో ఇంత తక్కువ రేటుకి ఈ నెంబర్ ఇవ్వడం తెల్సి నోరెళ్లబెడ్తున్నారు. ఆన్ లైన్ లో ఈ నెంబర్ కోసం రవాణా శాఖ 50వేలు నిర్ణయించింది. మరి లక్షా 7వేలకే ఎలా ఇచ్చేసారంటే, అంతగా ఈసారి రెస్పాన్స్ లేదట. 

ఇంత తక్కువ రేటుకి అమ్ముడుపోయాడం ఆశ్చర్యంతో పాటు అనుమానాలకు తావిస్తోంది. హేతువాదులు,విద్యావంతులు మూఢ నమ్మకాలను కొట్టిపారేసినప్పటికీ ప్రజల్లో 9లక్కీ నెంబర్ అని విశ్వాసం బలంగా ఉంది. డబ్బున్నవాళ్ళకి ,నమ్మకం ఉన్నవాళ్ళకి ఇదొక పిచ్చి. గత ఐదేళ్లలో అందుకే పదిలక్షల వరకు డిమాండ్ పలికేది. అయితే ఈసారి రేటు తగ్గడం వెనుక వాహన దారులు సిండికేట్ అయ్యారన్న వాదనలు విన్పిస్తున్నాయి. కొందరు ఏజంట్స్ తక్కువ మొత్తానికే ఇలాంటి నెంబర్స్ ఇప్పిస్తున్నారని, ఇందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యాన్సీ నెంబర్స్ విక్రయంలో కూడా చక్రం తిప్పుతున్నారట కొందరు ఏజెంట్స్.