Movies

మంచు విష్ణు భార్య వెరోనికా గురించి ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్న వెరోనికా సాక్షాత్తు వైఎస్ జగన్ కి సోదరి. రాజారెడ్డి ఫ్యామిలిలో చిన్నమనవరాలు. రాజారెడ్డి నాల్గవ కొడుకు సుధాకర్   రెడ్డి,విద్యా రెడ్డి దంపతుల  కుమార్తె వెరోనికా. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈమెకు స్వయానా పెదనాన్న. ఈ భూమి మాసపత్రికను విద్యారెడ్డి నిర్వహిస్తున్నారు. ఆఫ్రికాలో వారి కుటుంబానికి ఎన్నో వ్యాపారాలున్నాయట. ప్రముఖ నిర్మాత సిసి రెడ్డి కూతురే విద్యారెడ్డి. సుధాకర్ రెడ్డి కూడా  వ్యాపారవేత్త.

అమెరికాలోనే పుట్టి పెరిగిన వెరోనికాకు అమెరికా పౌర సత్వం కూడా ఉంది. డాక్టర్ అవ్వాలని కోరిక గల ఈమె పాఠశాలలో చదువుతునప్పుడు అమెరికాలో ఓ ఆసుపత్రిలో వాలంటీర్ గా సేవలు అందించడానికి వెళ్ళింది. అయితే అక్కడ మృతదేహాలను చూసి,ఖంగు తింది. దాంతో డాక్టర్ అవ్వాలనే కోరికను విరమించుకుంది. సెలవల్లో తాతయ్య సిసి రెడ్డితో కల్సి గడపడానికి హైదరాబాద్ వచ్చేది. తాతయ్య అనుభవాలు నేర్పిన పాఠాలు విని,తన ఆశయాలను చెబుతూ సలహాలు,, సూచనలు తీసుకునేదట. 

ఇటీవలే తాత సిసి రెడ్డి మరణించినపుడు తన తాత దగ్గర ఎన్నో నేర్చుకున్నానని గద్గద స్వరంతో చెప్పింది. ఇక షర్మిల మాదిరిగానే తనను పెదనాన్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చూసేవారని,తాను చేయబోయే పనులు చెబుతుంటే ఆసక్తిగా వినేవారని వెరోనికా చెప్పింది. తండ్రి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉండగా, తల్లి వైపు సినీ,వ్యాపార నేపధ్యం ఉంది. దీంతో సినీ నేపధ్యం గల మంచు విష్ణుని ఇష్టపడి పెళ్లిచేసుకుంది. విష్ణు మాట తీరు,నడవడిక,మంచితనం బాగా నచ్చడంతో మనసిచ్చింది. 

వెరోనికా మంచితనం చూసి విష్ణు కూడా మనసు పారేసుకోవడంతో పెద్దలు కాదనలేక పోయారు. దీంతో ఇద్దరికీ పెళ్లి చేసారు. ప్రముఖుల నడమ ఇద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ జంటకు అరియానా,విరియానా అనే ఇద్దరు కవల పిల్లలు. ఇప్పటికే శ్రీ విద్యానికేతన్ మంచు ఫ్యామిలీ నిర్వహిస్తున్నప్పటికీ అమెరికాలో తాను చదువుకున్న స్కూల్ లాంటిది తెలుగు రాష్ట్రాల పిల్లలకు అందుబాటులో తేవాలని స్కూల్ స్థాపించింది. భర్త,ఫ్యామిలీ ప్రోత్సాహంతో సక్సెస్ ఫుల్ గా రాణించగలుగుతున్నానని చెబుతోంది.