Movies

గుండమ్మ కథ సీరియల్ హీరోయిన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు

సీరియల్ అయినా, సినిమా అయినా సరే సన్నగా నాజూగ్గా ఉంటేనే అందం. అలాంటి వాళ్ళనే హీరోయిన్ గా యాక్టింగ్ కి తీసుకుంటారు. లావుగా ఉంటె ఛాన్స్ లు రావు . ఫాన్స్ ఉండరు అంటారు కానీ గుండమ్మ కథ హీరోయిన్ గీత ఈ నానుడిని మార్చేసింది. లావుగా ఉన్నాసరే ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకున్న ఈమె అసలు పేరు పూజా మూర్తి. తనకు ఈ సీరియల్ మంచి గుర్తింపు తెచ్చిందని అంటోంది. ఈమె తల్లిదండ్రులకు ఈమె ఒక్కర్తే కూతురు. నాన్న శ్రీనివాస మూర్తి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. తల్లి గృహిణి. బంధువులు తెలంగాణ కోదాడలో ఉండగా, వీళ్ళు మాత్రం బెంగళూరులో ఉంటారు. 

చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న పూజ కు నటన మీద ఆసక్తి ఉండడంతో తండ్రి ఎంకరేజ్ చేశారట. చదువుకునేటప్పుడు స్టేజ్ షోస్ వేసిందట. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా తన ఫ్రెండ్ కారణంగా కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. దాంతో శాస్త్రీయ నృత్యం చేయడం కుదరకపోవడంతో బరువుకూడా పెరగడం మొదలైంది. తనను తాను కష్ట పెట్టుకోవడం ఎందుకని సన్నగా అవ్వడానికి కృషి చేయకపోవడంతో ఛాన్స్ లు రాలేదట. దాంతో నెలరోజులు ఖాళీగా ఉందట. ఇక రెండేళ్లపాటు నైట్ షిఫ్ట్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేశానని., దాంతో బరువు మరింత పెరిగాను. ఆత్మస్థైర్యంతో ఉన్నానని చెప్పింది. 

బ్రహ్మకంటూ అనే కన్నడ సీరియల్ ని రీమేక్ చేస్తూ హీరోయిన్ ని వెదుకుతున్న సమయంలో పూజకు ఛాన్స్ వచ్చింది. ఆమె ఫ్రెండ్ కారణంగా ఆమెకు ఫోన్ రావడంతో తాను నటించడం లేదని చెప్పేసిందట. ‘నేను లావుగా ఉంటాను. హీరోయిన్ అంటే సన్నగా ఉండాలి కదా’అని పూజ అనేసరికి ఈ సీరియల్ కి మీలాంటి వాళ్ళే సరిపోతారని యూనిట్ నుంచి సమాధానం వచ్చిందట. ఆడిషన్స్ కి రమ్మనడంతో గుండమ్మ కథ సీరియల్ కి పూజ హీరోయిన్ గా సెలక్ట్ అయిపొయింది. అందరూ నన్ను గుండమ్మ అని  పిలుస్తున్నారని చెబుతోంది. ఆత్మ సంతృప్తితో ఉన్నానని,ఛాన్స్ లు వచ్చినన్నాళ్ళూ నటిస్తానని అంటోంది.