మల్లేశం మూవీ వదులుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి ‘పెళ్లి చూపులు’ చిత్రం ద్వారా తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్న ‘ప్రియదర్శి’ ఆ చిత్రం తరువాత స్పైడర్, వున్నది ఒకటే జిందగీ, తొలిప్రేమ, ఆ!, F2 వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు మల్లేశం చిత్రం తో ఒక కామెడీయే కాకుండా అన్ని యాంగిల్స్ లో మెప్పించి ప్రశంసలు అందుకుంటున్నాడు

‘ఆసు యంత్రం’ కనిపెట్టిన సాధారణమైన నిరు పేద ‘చింతకింది మల్లేశం’ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలై అద్భుతమైన స్పందన సంపాదించుకుంది. విడుదలైన అన్ని చోట్ల ఊహించని వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతుంది.

ఇదిలా ఉంటే, ఈ చిత్రం యొక్క దర్శకుడు ‘రాజ్ రాచకొండ’ మీడియా తో మాట్లాడుతూ..’మల్లేశం’ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. మొదట ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని లేదా విజయ్ దేవరకొండని హీరోగా అనుకున్నాడట కానీ వారి డేట్స్ అందుబాటులో లేక ప్రియదర్శి కి ఈ సువర్ణావకాశం దక్కింది. ఒకవేళ ముందు అనుకున్నట్టు నాని లేదా విజయ్ మల్లేశం పాత్ర పోషిస్తే దాని రిజల్ట్ ఏ రేంజ్ లో ఉండేదో మరి.