Movies

నిర్మలమ్మ గారి జీవితంలో అసలు ట్విస్ట్ ఇదే… రియల్ లైఫ్ స్టోరీ

హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు  క్యారెక్టర్ ఆర్టిస్టులు,ముఖ్యంగా బామ్మ పాత్రల్లో రాణించిన నటులు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా నిర్మలమ్మను చెప్పుకోవాలి. దేవత,చిన్నోడు పెద్దోడు,ఆ ఒక్కటి అడక్కు,దళపతి,చిరాయుడు , గ్యాంగ్ లీడరు,మాయలోడు,కర్తవ్యం, వంటి చిత్రాలతో బాగా గుర్తింపు పొందింది. సినీ నిర్మాతగా కూడా రాజేంద్రప్రసాద్,రజనీ కాంబినేషన్ లో చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం సినిమాను రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో తీసింది. ఇక వయస్సు కారణంగా స్నేహం కోసం చిత్రం తర్వాత దాదాపు నటించడం మానేసిన నిర్మలమ్మ ఆతర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి కోరిక మేరకు ప్రేమకు స్వాగతం మూవీలో నటించింది. 

జెడి చక్రవర్తి హీరోగా నటించిన ఈ మూవీ నిర్మలమ్మకు ఆఖరి చిత్రం. ఆతర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2009ఫిబ్రవరిలో కన్నుమూసిన నిర్మలమ్మ తన నటనతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసింది. బామ్మ పాత్రల కోసం ఆమెకు డిమాండ్ ఉండేది. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసిన సందర్భాలున్నాయి. నందమూరి, అక్కినేని,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,చిరంజీవి,నాగార్జున,బాలకృష్ణ,వెంకటేష్ ఇలా అందరితో నటించిన నిర్మలమ్మ ఏపీలోని మచిలీపట్టణం లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు రాజమణి. 19ఏళ్ళ వయస్సులో జివి కృష్ణారావు తో వివాహం అయింది. ప్రొడక్షన్ మేనేజర్ గా ఆయన పనిచేసేవారు. నిర్మలమ్మ దత్త పుత్రిక పేరు కవిత. 

నాటకాల్లో నటిస్తూ మంచి పేరుతెచ్చకున్న నిర్మలమ్మ 16ఏళ్ళ వయస్సులో 1943లో గరుడ గర్వభంగం మూవీలో చెలికత్తె పాత్రతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో చిన్నచిన్న పాత్రలే దక్కినప్పటికీ ఆమె నటనతో అందరికీ దగ్గరైంది. దీంతో తల్లిగా, బామ్మగా ఎన్నో పాత్రలను ఆమెకు డైరెక్టర్స్ ఇచ్చారు. కాంతారావు నటించిన పేదరాశి పెద్దమ్మ సినిమాలో వృద్ధురాలిగా నటించింది. ఆసినిమా ఘన విజయం సాధించడంతో నిర్మలమ్మకు అంతవరకూ ఉన్న అమ్మ పాత్రలు బామ్మ పాత్రలుగా మారిపోయి, ఛాన్స్ లు బాగా వచ్చాయి. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ వంటి సినిమాల్లో నటించి హాస్య రసాన్ని కూడా పండించింది.