అనసూయ ఏ స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిందో తెలుసా ?
‘జబర్జస్ట్’ చూసే ప్రతి అభిమానికి అనసూయ తెలుసు. అనసూయ జబర్జస్ట్ షో తోనే బాగా పాపులర్ అయింది. ఒక వైపు టీవీ షో లకు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తుంది. ఆమె సినిమాలను ఆచి తూచి సెలక్ట్ చేసుకుంటుంది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘రంగస్థలం’ సినిమా,మోహన్ బాబు సినిమా ‘గాయత్రీ’ లో జర్నలిస్ట్ పాత్రను పోషిస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. అసలు సినిమాల్లోకి ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం.
అనసూయ ఒక స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ భామ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నాగ’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన,ఒక్క క్షణం ,విన్నర్ సినిమాలతో తానేమిటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతుంది.
ప్రస్తుతం అనసూయ నటించిన రంగస్థలం,గాయత్రీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని అఫర్ వస్తే మొహమాటం లేకుండా నో చెప్పిన సంగతి తెలిసిందే. అనసూయ పాత్రలను బాగా సెలక్ట్ చేసుకొని మరీ ముందుకు సాగుతుంది. చిరు,కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాలో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది.