Kargil Vijay Divas

కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ వ్యూహం…???

మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు. గస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకి పంపలేదు మరియు శతఘ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటు దారులకు వీలు కల్పించింది. కానీ, మే రెండో వారానికి, సౌరభ్ కాలియా నేతృత్వం లోని భారత గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో చొరబాట్ల తీవ్రత తెలియని భారత దళాలు, ఇది కేవలం ఉగ్రవాదుల (జీహాదీలు) పని ఆనుకుని రెండు మూడు రోజుల్లో వారిని వెళ్ళగొట్టవచ్చు అనుకుంది. కానీ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల పరిస్ధితి ఇలాగే ఉండడాన, వీరు అవలంబిస్తున్న పద్ధతులలో తేడాల వల్లనూ ఇది చాలా పెద్ద దాడేనని నిర్ధారణకు వచ్చాయి. మొత్తం 130 – 200 చ.కి.మీ. మేర భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ముషారఫ్ మాత్రం 1,300 చ.కి.మీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాడు.

భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ తో జవాబిచ్చింది. 200,000 భారత సైనికులను పంపింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ని ప్రారంభించింది. భారత నావికా దళం కూడా పాకిస్తాన్ కు చెందిన ఓడరేవులకు (ముఖ్యంగా కరాచి ఓడరేవుకి) వెళ్ళే మార్గాలను మూసివేసేందుకు సిద్ధమైంది.  పూర్తి స్ధాయి యుద్ధం సంభవిస్తే పాక్ వద్ద కేవలం ఆరు రోజులకు సరిపడ ఇంధనము మాత్రమే ఉందని అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపాడు