Movies

అర్జున్ రెడ్డి ని మిస్ చేసుకున్న భామ…ఎవరో తెలుసా?

అర్జున్ రెడ్డి సినిమా గురించి తెలియని వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆ సినిమా అంతటి ఘన విజయాన్ని సాధించింది. అంతేకాక టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. దీనితో ఈ సినిమాలో హీరో, హీరోయిన్ గా నటించిన విజయ్ దేవరకొండ, షాలినీ పాండే రాత్రి రాత్రికి స్టార్స్ అయ్యిపోయారు. సినిమాని కొంచెం బోల్డ్ గా తీయటం వలన తమిళం, హిందీలలోనూ కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. షాలినీ పాండే ఒక పక్క టాలీవుడ్ మరో పక్క కోలీవుడ్ లోను వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉంది.

అయితే ఈ సినిమా అవకాశం మొదట మరో హీరోయిన్ దగ్గరకు వెళ్లిందట. అయితే సినిమాలో కాస్త బోల్డ్ గా ఉండటంతో ఆ హీరోయిన్ సినిమా చేయటానికి దైర్యం చేయలేక వెనకడుగు వేసిందట. ఆమె ఎవరో కాదు… మలయాళ నటి పార్వతీ నాయ‌ర్‌. 

ఆమె కథ విని భయపడిందట. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించటం…విజయ్ దేవరకొండ, షాలినీ పాండేలకు విపరీతమైన క్రేజ్ రావటంతో ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా బాధ పడుతుందట. అంతేకాక ఆ సినిమా అంత హిట్ అవుతుందని అసలు ఉహించలేదట. అయినా ఇప్పుడు బాధపడి ఏమి లాభం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."